'సూపర్‌రిచ్ 5,000మంది కంటే ఎక్కువలేరు, భారం పంచుకోండి'
న్యూఢిల్లీ: బడ్జెట్ సందర్భంగా సూట్‌కేసుకు బదులు ఎరుపు రంగు బ్యాగుతో రావడంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తమ ప్రభుత్వం సూట్‌కేసుల మార్పిడీకి వ్యతిరేకం అని చెప్పేందుకు ఓ సంకేతమని తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేసేందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం తేలికైన టెండర్ల విధానం అమల్లోకి తీసుకు వచ్చిందన్నారు.
ఒక ఫైల్ తీసుకు వచ్చినట్లుగా ఎరుపు రంగు సంచిలో బడ్జెట్ ప్రతులు తీసుకు వచ్చానని, సూట్‌కేసు తీసుకురాకపోవడం పెద్ద వివాదంగా మారిందని, ఎందుకంటే అది తోలుతో తయారైంది కాబట్టి, నేను అంతగా ఆలోచించలేదని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వంలో అన్నీ పారదర్శకమని, అందుకే సూట్‌కేసులో తీసుకు రాలేదన్నారు.

సూపర్ రిచ్‌కు పన్నులు ఎందుకు పెరిగాయని ప్రశ్నిస్తున్నారని, పేదరికాన్ని నిర్మూలించి, అందరికీ సమాన అవకాశం లభించే మెరుగైన భారతదేశం వైపు వెళ్లాలని తాము కోరుకుంటున్నామని, అందులో భాగంగా కాస్తభారం పంచుకోవాలని సంపన్నులను కోరుతున్నామన్నారు. ఎలాంటి ఆలోచన లేకుండా సుంకం విధించామని భావించవద్దని, మీరు వ్యాపారం చేసుకోవచ్చునని, కానీ కాస్త ఎక్కువ పన్నులు కట్టాలని అడుగుతున్నామని, సంపద, ఉద్యోగాలు సృష్టిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూనే, పేదరిక నిర్మూలకు కొంత భారం పంచుకోవాలని కోరుతున్నామన్నారు.
అయినా, సూపర్ రిచ్ ప్రజలు కేవలం 5,000 మంది వరకు మాత్రమే ఉన్నారని చెప్పారు. పేదరిక నిర్మూలనలో భారత్ ఒక పాయింట్ దగ్గరకు వచ్చిందని, అందరికీ అవకాశాలు లభించే భారత్ వైపు పయనించాలని కోరుకుంటున్నామని, అందుకే సంపన్నులు చెల్లించే ఆదాయ పన్నుపై సుంకం విధించామని చెప్పారు. ఎంటర్ ప్రెన్యూనర్స్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమన్నారు.


Click it and Unblock the Notifications