న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ HDFC బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి రూ.5,676 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాదితో (రూ.4,808.35 కోట్లు) పోలిస్తే 18.04శాతం మేర పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.5,676.06 కోట్ల నికర లాభం ప్రకటించింది. వడ్డీ ఆదాయంలో వృద్ధి బ్యాంకు లాభం పెరిగేందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం కూడా రూ.28,000 కోట్ల నుంచి రూ.34,324 కోట్లకు చేరుకుంది.
సమీక్ష త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం కింద రూ.29,176 కోట్లు ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.23,978 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు (NPA) రూ.9,538.62 నుంచి రూ.11,768.95 కోట్లకు పెరిగాయి. నికర NPAలు 0.41 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయి.

క్వార్టర్ 1లో కేటాయింపులు, కాంటిన్జెన్సీలు రూ.1,629 కోట్ల నుంచి రూ.2,613 కోట్లకు పెరిగాయి. బ్యాంకు ప్రారంభమై పాతిక సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.5 ప్రత్యేక మధ్యంతర డివిడెండును బోర్డు సిఫార్సు చేసింది.
ఏప్రిల్-జూన్ స్టాండలోన్ పద్ధతిలో బ్యాంకు నికర లాభం 21% పెరిగింది. ఆదాయం 22.7% వృద్ధితో రూ.26,367 కోట్ల నుంచి రూ.32,361.80 కోట్లకు పెరిగింది. జూన్ చివరి నాటికి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.33% నుంచి 1.4% పెరిగింది. నికర నిరర్థక ఆస్తులు కూడా 0.41% నుంచి 0.43%కు పెరిగింది.
వ్యాల్యూ పరంగా స్థూల నిరర్థక ఆస్తులు రూ.9,538 కోట్ల నుంచి రూ.11,768 కోట్లకు, నికర నిరర్థక ఆస్తులు రూ.2,907 కోట్ల నుంచి రూ.3,567 కోట్లకు పెరిగాయి. రుణాల వృద్ధి కూడా 17.10% ఎగబాకి రూ.8,29,730 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లు 18.5% పుంజుకుని రూ.9,54,554 కోట్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications