జీరో ఇంట్రెస్ట్ లోన్స్.. ! మొదట ఈ పాయింట్స్ తెలుసుకోండి

ఓలా క్యాబ్‌ బుక్ చేసుకుని ప్రయాణం పూర్తైన తర్వాత అప్పుడే డబ్బు కట్టాల్సిన పనిలేదు. పేటిఎంలో సినిమా టికెట్స్ బుక్ చేసుకోవడానికి డబ్బు మన ఖాతాలో ఉండాల్సిన పనిలేదు. అలానే అమెజాన్‌లో ఏదైనా వస్తువు కావాలంటే మన దగ్గర డబ్బు ఉండాల్సిన పనేలేదు. ఓలా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. లోన్ ఈజీగా వచ్చేస్తోంది. పైసా ఖర్చు లేకుండా, ఏ మాత్రం కష్టపడకుండా రుణాలు దొరికిపోతున్నాయి. అది కూడా ఎలాంటి వడ్డీ లేకుండా. ఇంకేముంది దీంతో ఈ మధ్య జనాలు విచ్చలవిడిగా ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఉండే కొన్ని మెలికలు మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి లోన్స్ తీసుకునే ముందు ఈ పాయింట్లను గమనంలో ఉంచుకోండి.

ఈజీ లోన్

ఈజీ లోన్

సులువుగా లోన్ పొందడం ఈ మధ్య చాలా కామన్. పెద్దగా ఎలాంటి డీటైల్స్ లేకుండా నిమిషాల వ్యవధిలో లోన్ వచ్చేస్తోంది. అయితే ఇందులో గుడ్ క్రెడిట్, బ్యాడ్ క్రెడిట్ అనే పాయింట్ మర్చిపోవద్దు. ఇల్లు, పొలం, బంగారం, పై చదువుకు లోన్లు తీసుకుంటే అది గుడ్ క్రెడిట్ అవుతుంది. అదే ఫుడ్ బిల్స్ చెల్లించేందుకు, బట్టలు కొనేందుకు, సినిమాలు, షికార్లు, పార్టీలకు రుణాలు తీసుకుంటే అది బ్యాడ్ క్రెడిట్ అవుతుంది.

బట్టలు కొనేందుకు కూడా లోన్ !

బట్టలు కొనేందుకు కూడా లోన్ !

ఆర్థిక సంస్థలు ఈ మధ్య మరీ సులువుగా లోన్లు ఇచ్చేస్తున్నాయి. చివరకు మీరు తినే ఫుడ్ బిల్‌ను కూడా క్రెడిట్‌గా ఇచ్చేస్తున్నాయి. వాయిదా పద్ధతుంది దేనికైనా అనే చందంగా.. ఇప్పుడు డబ్బులు కట్టకుండా పేమెంట్‌ను డిఫర్ చేసుకోవచ్చు. కొన్ని రోజుల గ్రేస్ పీరియడ్‌తో సదరు సొమ్మును తిరిగి చెల్లించే వీలుంటుంది. కళ్ల ముందు ఫ్రీ క్రెడిట్ కనిపిస్తూ ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు. గ్రేస్ పీరియడ్ వస్తోందని కదా అంటూ ఖచ్చితంగా దాన్నే వినియోగించుకుంటారు. వాస్తవానికి ఇవన్నీ స్మాల్ టికెట్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇలాంటి వాటిల్లో మీకు పదిహేను రోజుల వరకూ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఒక వేళ డ్యూ డేట్ లోపు చెల్లించకపోతే రూ.250 ఫ్లాట్ ఫీజునో లేకపోతే నెలకు 3 శాతం వరకు పెనాల్టీని కూడా విధిస్తాయి సంస్థలు. అందుకే అవసరాన్ని బట్టి వాడుకున్నా పేమెంట్స్ విషయంలో ఖచ్చితత్వం పాటించకపోతే మొదటికే మోసం వస్తుంది.

గ్రేట్ ఇండియన్ సేల్స్‌లో కొనేయొచ్చా ?

గ్రేట్ ఇండియన్ సేల్స్‌లో కొనేయొచ్చా ?

ఈ మధ్య ఈ-కామర్స్ సంస్థలు సేల్స్ పేరుతో ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఇచ్చి ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈజీగా టెంప్ట్ అయిపోతాం. అయితే టీవీలు, ఫ్రిజ్‌లు, కాస్ట్‌లీ ఫోన్స్ కొనేందుకు రుణాలు తీసుకోకపోవడమే మంచిది. దాని బదులు నెలనెలా కొంత మొత్తాన్ని దాచుకుని అప్పుడు ఆ సొమ్ముతో మనకు కావాల్సిన వస్తువును తీసుకోవడం ఉత్తమమనేది సలహా. దాని వల్ల తక్కువ ధరకు మంచి చౌక బేరాన్ని పొందొచ్చు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అని చెప్పినా ఒక్కోసారి ప్రాసెసింగ్ ఫీజు, ఫ్లాట్ ఫీజ్ పేరుతో కొన్ని అదనపు ఛార్జీలుంటాయి. ఒక్కో రూ.1-2 వరకూ వడ్డీని వసూలు చేస్తాయి సంస్థలు.

రుణాలు తీర్చేందుకు మరో రుణం

రుణాలు తీర్చేందుకు మరో రుణం

కొన్ని సార్లు మనం రుణాలు తీర్చేందుకు మరో రుణం తీసుకుంటాం. రెండు, మూడు క్రెడిట్ కార్డుల బిల్స్ కట్టలేక వాటిన్నింటినీ తీర్చేయడానికి ఇంకో చోట లోన్ తీసుకుని వీటిని క్లియర్ చేసి నానా తంటాలు పడ్తాం. ఇలా అత్యవసరాల్లో తీర్చుకునే రుణానికి ఒక్కోసారి రూ.100కి 3నుంచి 4 రూపాయల వరకూ వడ్డీని కట్టాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి వాటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+