రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఐన రిలయన్స్ జియో ఇంఫ్రాటెల్ లోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. అమెరికాకు చెందిన బడా ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఈ మేరకు కంపెనీతో జట్టు కడుతోంది. బ్రూక్ ఫీల్డ్ అనే కంపెనీతో పాటు మరి కొంత మంది ఇన్వెస్టర్లు కలిసి ఏకంగా రూ 25,215 కోట్ల పెట్టుబడులను సమకూర్చటం విశేషం. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇప్పటికే దేశంలో చౌక ధరల్లో మొబైల్ సేవలు అందిస్తూ ఒక సంచలనమే ఐంది. తాజాగా రిలయన్స్ జియో దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఆవిర్భవించింది. మూడు దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందిన ఎయిర్టెల్ ను వెనక్కి నెడుతూ జియో రెండో స్థానంలోకి ప్రవేశించింది.

టవర్ల బిజినెస్ మరింత పటిష్టం...
బ్రూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీతో ఈ మేరకు పెట్టుబడుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఐన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దీంతో రిలయన్స్ జియో ఇంఫ్రాటెల్ కంపెనీల్లోకి రూ 25,125 కోట్ల రాకకు మార్గం సుగమం ఐంది. ఈ పెట్టుబడులతో రిలయన్స్ టవర్ల వ్యాపారాన్ని మరింత పటిష్టం చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలో అతిపెద్ద టవర్ల కంపెనీగా ఇది ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అయితే, నెట్వర్క్ విస్తరణ కోసం కంపెనీగా భారీగా రుణాలు చేసింది. ఈ భారాన్ని తగ్గించుకొని బిజినెస్ ను వృద్ధి బాట లో నడిపించేందుకు ఈ పెట్టుబడులను వినియోగించనుంది.

తీరనున్న అప్పులు...
తాజా పెట్టుబడితో రిలయన్స్ జియో ఇంఫ్రాటెల్ అప్పులు కొంత మేరకు తీరనున్నాయి. మొత్తం పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని రుణాల చెల్లింపు కోసం వినియోగించగా... మిగిలిన మొత్తాన్ని కంపెనీలో 49% వాటా కొనుగోలు కొరకు వినియోగించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు మార్కెట్ రేగులతోర్ సెబీ తో పాటు, ప్రభుత్వం నుంచి పలు అనుమతులు లభించాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ముందో వెనుకో అనుమతులు లభించటం తధ్యమేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తోలి స్థానంపై గురి?
ఏడాది పాటు పూర్తి ఉచిత సర్వీస్ లను అందించి ఒక్క ఏడాదిలోనే 16 కోట్ల వినియోగదారులను సంపాదించినా రిలయన్స్ జియో ... ఈ విషయంలో ప్రపంచ రికార్డునే నెలకొల్పింది. జియో తో పోటీలో భాగంగా మిగితా కంపెనీలు కూడా డేటా, వాయిస్ కాల్స్ ధరలు తగ్గించేసాయి. దీంతో నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అయితే, రిలయన్స్ జియో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కేవలం డేటా ఛార్జీలుగా తక్కువ మొత్తం తో అధిక ప్రయోజనాన్ని కల్పిస్తోంది. దీంతో ఈ కంపెనీ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 32 కోట్లకు పైగా మంది కస్టమర్లతో దేశంలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఐడియా సంస్థ (వోడాఫోన్ ఐడియా ) దేశంలో 38 కోట్లకు పైగా వినియోగదారులతో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అందుబాటు ధరలు, పటిష్టమైన టవర్ల వ్యవస్థతో పాటు, త్వరలోనే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లతో రిలయన్స్ జియో మరింత మంది వినియోగ దారులను ఆకర్షించే అవకాశం ఉందని... తద్వారా తోలి స్థానానికి చేరుకోవడం దానికి పెద్ద కష్టమైన పనేమీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగానే జరుగుతుందేమో చూడాలి మరి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications