ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ షాప్ క్లూస్ నష్టాల బాట పట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ సంస్థ అనతికాలంలోనే మంచి లాభాలు గడించింది. అయితే మార్కెట్లో మరిన్ని ఈ-కామర్స్ సైట్స్ రావడంతో షాప్ క్లూస్ ఈ పోటీలో నిలువలేకోపోయింది. ఫలితంగా నష్టాల దిశగా పయనించింది. తాజాగా షాప్‌క్లూస్ సంస్థలో పనిచేసే 50శాతం మంది ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటన చేసి ఉద్యోగస్తులకు షాక్‌కు గురిచేసింది. గురుగ్రామ్‌లోని కార్యాలయంలో ఉద్యోగస్తులందరు సమావేశం కావాల్సిందిగా చెబుతూ ఓ ఈమెయిల్‌ను వారికి పంపడం జరిగింది.
ఈమెయిల్ రావడంతో ఉద్యోగస్తులందరూ గురుగ్రామ్ కార్యాలయానికి చేరుకున్నాక షాకింగ్ ప్రకటన చేశారు. కొందరి పేర్లను ప్రకటిస్తూ వారందరినీ తొలగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. జూలై 18 వరకు తమకు వేతనాలను చెల్లిస్తామని చెప్పిన షాప్‌క్లూస్ సంస్థ ఇంత హఠాత్తుగా ఉద్యోగుల తొలగింపుకు పరిహారం ఏమీ ఇవ్వలేమని ప్రకటించింది. ఇక తొలగించబడిన ఉద్యోగులు చాలామంది ఆపరేషన్స్ విభాగానికి చెందినవారు కావడం విశేషం

ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీలో దాదాపు 600 మంది ఉద్యోగస్తులు ఉండేవారు. ఇక నష్టాల బాటలో పయనిస్తున్న నేపథ్యంలో సంస్థ యాజమాన్యం 200 మందిని తొలగించింది. దీంతో ఉద్యోగస్తుల సంఖ్య 400కు చేరుకుంది. ఇక బుధవారం ప్రకటనతో దాదాపు 200 మందిని తొలగించింది. ప్రస్తుతం ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 200 మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఇంకా వివరాలు సంస్థ తెలపలేదు. అయితే తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మరో చోట ఉద్యోగం వెతుక్కోవాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే చిన్న హింట్ ఇచ్చింది. దీంతో షాప్‌క్లూస్ ఉద్యోగులు ఇతర కంపెనీల్లో ఉద్యోగం కోసం వెతికి కొందరు కొత్త ఉద్యోగంలో చేరారు.
గత రెండేళ్లలో ఉద్యోగస్తుల తొలగింపుపై కంపెనీ దృష్టిసారించిందని షాప్‌క్లూస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వారి స్థానంలో ఆటోమేటిక్ మెషీన్లను రీప్లేస్ చేస్తున్నట్లు తెలిపారు.ఇక 50శాతం ఉద్యోగస్తులను తొలగించడంతో ఇక లాభాలపై దృష్టిసారిస్తామని షాప్‌క్లూస్ యాజమాన్యం తెలిపింది. గత రెండేళ్లుగా వచ్చిన నష్టాలను పూడ్చి లాభాల దిశగా పయనించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే షాప్‌క్లూస్‌ను మరో ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ కొనుగోలు చేయాలని భావించింది. అయితే అది కొన్ని కారణాలతో డీల్ నిలిచిపోయింది. 300 నుంచి 350 మిలియన్ డాలర్లకు కంపెనీని అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పడంతో ఈ రేటుపై అభ్యంతరం తెలిపింది స్నాప్ డీల్.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications