For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీపీఎస్ఈ ఈటీఎఫ్ ప్రారంభమైంది... పెట్టుబడి పెడతారా?

|

సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ ( సీపీఎస్ఈ ) కంపెనీల షేర్లతో కూడిన ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఈ రోజే దీని సబ్ స్క్రిప్షన్ మొదలైంది. స్వల్పకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్లు దీనిపై దృష్టి సారించవచ్చు. ఆరో విడతగా ఈ ఈటీఎఫ్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ సారి దీని ద్వారా రూ. 10,000 కోట్లవరకు నిధులు సమీకరయించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!HDFC హెచ్చరిక: మీ డబ్బు దొంగిలిస్తారు.. ఇలా చేయకండి!

ఈ కంపెనీలున్నాయ్...

ఈ కంపెనీలున్నాయ్...

* సీపీఎస్ఈ ఈటీఎఫ్ లో 11 కేంద్ర ప్రభుత్వ కంపెనీల షేర్లున్నాయి. ఆ కంపెనీలు... ఓఎన్జీసీ, ఎన్ టీ పీసీ, కోల్ ఇండియా, రురల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా, ఎన్ బీసీసీ ఇండియా, ఎన్ ఎల్ సి ఇండియా, ఎస్ జే వీ ఎన్ వంటి కంపెనీలు ఉన్నాయి.

* సీపీఎస్ఈ ఈటీఎఫ్ అనేది ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఎక్స్చేంజి ట్రేడెడ్ స్కీం. అంటే ఇందులో ఎలాంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదన్న మాట.

* సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా ప్రభుత్వం సీపీఎస్ ఈ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఏర్పడుతోంది.

ఇలా ఉంది పనితీరు..

ఇలా ఉంది పనితీరు..

* గత మూడేళ్ళ కాలంలో 11 ప్రభుత్వ రంగ కంపెనీల్లో పదింటి పనితీరు మరీ అంత ఆకర్షణీయంగా ఏమీ లేదు. ఉదాహరణకు ఎంబీసీసీ ఇండియా షేరు దాదాపు 37 శాతం తగ్గింది. కోల్ ఇండియా 31 శాతం, ఎంఎల్సీ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆయిల్ ఇండియా 12-17 శాతం నష్టపోయాయి.

* అయితే ఆర్ఈసి మాత్రం 36 శాతం పెరిగింది. ఐ ఓ సి , పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు మాత్రం వరుసగా 36 శాతం, 20 శాతం పెరిగాయి.

* ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని స్వల్పకాలానికి పెట్టుబడులు పెట్టవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఐదేళ్ల క్రితం ప్రారంభం

ఐదేళ్ల క్రితం ప్రారంభం

* సీపీఎస్ఈ ఈటీఎఫ్ ను ప్రభుత్వం 2014 మార్చిలో ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు 10 కంపెనీల్లో వాటాను విక్రయించింది.

* ఐదు విడతల్లో రూ.38,500 కోట్లు సమీకరించింది. మొదటి విడతలో రూ.3,000 కోట్లు, రెండో విడతలో రూ. 6,000 కోట్లు, మూడో విడతలో రూ.2,500 కోట్లు, నాలుగో విడతలో రూ.17,000 కోట్లు, ఐదో విడతలో రూ.10,000 కోట్లు సమీకరించారు.

స్వల్పకానికి మంచిది

స్వల్పకానికి మంచిది

- రిటైల్ ఇన్వెస్టర్లు సీపీఎస్ఈ ఈటీఎఫ్ పెట్టుబడి పెట్టాలనుకుంటే స్వల్పకాలానికి పెట్టవచ్చని మార్కెట్ విశ్లేష కులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి మూడు నుంచి ఆరు నెలల్లో ఎగ్జిట్ కావొచ్చని చెబుతున్నారు.

* వాల్యూయేషన్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టి విలువ కాస్త పెరగ్గానే ఇందులోంచి బయటకు వచ్చే యోచన చేయమంటున్నారు.

* కాబట్టి సీపీఎస్ఈ ఈటీఎఫ్ పై ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

English summary

సీపీఎస్ఈ ఈటీఎఫ్ ప్రారంభమైంది... పెట్టుబడి పెడతారా? | 6th tranche of CPSE ETF opens today for retail investors: should you apply?

Retail investors can look to invest for the short term in the sixth tranche of Central Public Sector Enterprises (CPSE) Exchange Traded Fund (ETF) that opened for subscription today given its attractive valuations, say experts.
Story first published: Friday, July 19, 2019, 18:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X