న్యూఢిల్లీ: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) వృద్ధి క్షీణిస్తోందని మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ నీల్సన్ వెల్లడించింది. అర్బన్ కేంద్రాల్లో తక్కువ వ్యయం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మందగించిన నేపథ్యంలో FMCG వృద్ధి క్షీణించిందని పేర్కొంది. ముఖ్యమంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దగ్గడం వల్ల ఎక్కువ ప్రభావం పడింది. ఏప్రిల్ - జూన్ 2019 క్వార్టర్‌లో దీని వృద్ధి గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పడిపోయినట్లు తెలిపింది. ఇలా పడిపోవడం వరుసగా ఇది మూడో క్వార్టర్ అని పేర్కొంది.

మందగిస్తున్న వృద్ధి రేటు
గత ఆర్థిక సంవత్సరంలోని క్వార్టర్ 2లో FMCG వృద్ధి 16.4 శాతంగా ఉండగా, ఆ తర్వాత వరుస క్వార్టర్‌లలో పడిపోతోందని పేర్కొంది. ఈ ఏడాది (2019) మొదటి అర్ధ సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ వృద్ధి రేటు 12 శాతం ఉంది. దీనిని 13 శాతం నుంచి 14 శాతం అంచనా వేశారు. అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడాది FMCG రంగం మందగమనాన్ని ఎదుర్కొనే అవకాశముందని, ఈ ఏడాది ఈ రంగ వృద్ధి 9 శాతం నుంచి 10 శాతానికి పరిమితం కావొచ్చునని తెలిపింది.

కీలక రంగాల్లో వృద్ధి శాతం ఇలా...
కీలకమైన ఫ్యాక్టర్స్ విశ్లేషణ ఆధారంగా ఈ ఏడాదిలో FMCG రంగం వృద్ధి 9-10 శాతం సాధించే అవకాశముందని అంచనా వేసినట్లు రిటైల్ మెజర్‌మెంట్ సర్వీసెస్ సౌత్ ఏషియా హెడ్ సునీల్ ఖియానీ తెలిపారు. ఫుడ్ కేటగిరీ గ్రోత్ 10 శాతం నుంచి 11 శాతం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే పర్సనల్ కేర్ 7 శాతం, హోమ్ కేర్ సెగ్మెంట్ 8 శాతంగా ఉంటుందని పేర్కొంది.

ఊహించిన దాని కంటే తక్కువ వృద్ధి
తాము ఊహించిన దానికంటే వృద్ధి రేటు తక్కువగా ఉందని కంపెనీలు చెబుతున్నాయి. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా క్యాష్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తారని, కానీ సార్వత్రిక ఎన్నికల సమయంలో మాత్రం ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరిపి, తీసుకు వెళ్లాలని సూచించినట్లు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాలలో ప్రభావం చూపిందని పార్లే ప్రాడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ కృష్ణారావు అన్నారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటానికి తోడు మాన్‌సూన్ సీజన్ బాగా ఉంటే పరిస్థితులు బాగుంటాయని, కానీ ప్రారంభంలోనే వృద్ధి రేటు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామీణ అమ్మకాల వాటా 37 శాతం వరకు
2018లో FMCG రంగంలో వృద్ధి రేటు 14 శాతంగా ఉంది. ఈ రంగంలో రూ.4.2 లక్షల కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. రూరల్ సేల్స్ తగ్గడంవల్ల డిమాండ్ ప్రభావితం అయింది. మొత్తం FMCG సేల్స్‌లో గ్రామీణ అమ్మకాల వాటా 36 శాతం నుంచి 37 శాతంగా ఉంటుంది. గ్రామీణ FMCG అమ్మకాల విషయానికి వస్తే సాల్టీ స్నాక్స్, బిస్కెట్లు వంటి ఆహార ఉత్పత్తులపై అరవై శాతం ఖర్చు ఉంటుందని సునిల్ ఖియానీ తెలిపారు. దీనికి తోడు పట్టణ ప్రాంత సేల్స్ ప్రభావితం చేశాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుదల రెండింతలు అధికంగా ఉందన్నారు. ఇంతకుముందు, గ్రామీణ అమ్మకాల వృద్ధి రేటు పట్టణ మార్కెట్స్ కన్నా ఎక్కువగా ఉండేది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications