అమరావతి: సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో (PPA) అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ చేసిన ఆరోపణలపై నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. వైసీపీ ఆరోపణలు కొట్టిపారేయడంతో పాటు, జగన్‌కు చెందిన కంపెనీని లాగి, అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నాలు చేశారు. PPAలపై విమర్శలకు ఒక్కో దానికి సమాధానం చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. తమ ఒప్పందాల్లో ఎలాంటి క్విడ్ ప్రోకోలు (నీకిది - నాకది) లేవన్నారు.

మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాం
టీడీప ప్రభుత్వం సోలార్, విండ్, బయోమాస్ ప్లాంట్స్‌ల్లో ఉత్పత్తయ్యే విద్యుత్తుని అధిక ధరలకు కొనుగోలు చేసేలా PPAలు చేసుకున్నందున ఏపీపై రూ.3వేల కోట్ల భారం పడుతుందని, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కొనుగోలు వల్ల ఖర్చు పెరిగిందన్న అధికారుల వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. విద్యుత్ కొరత ఉన్న రాష్ట్రం నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చామని చెప్పారు.

జగన్ కంపెనీకి రూ.5 కావాలా...
జగన్‌కు కర్ణాటకలో సండూర్ పవర్ పేరుతో రెండు విద్యుత్ ప్లాంట్స్ ఉన్నాయని, వాటిలో ఒకటి 22.5 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం, మరొకటి 24 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రమని చెప్పారు. హైడల్ ప్రాజెక్టులో ఉత్పత్తయ్యే విద్యుత్‌కు 2005లో యూనిట్ రూ.2.90 చొప్పున ధర ఖరారు చేశారని, తమకు యూనిట్‌కు రూ.4.16 ఇవ్వాలని జగన్ కంపెనీ 2016లో ERCని ఆశ్రయించిందన్నారు. అప్పుడు యూనిట్ ధర రూ.3.42కు పెంచారని, పవన విద్యుత్‌కు అన్నీ కలిపి యూనిట్‌కి రూ.5 చొప్పున ధర ఖరారు చేయించుకున్నరన్నారు.

జగన్ కంపెనీకి అదనంగా రాయితీ...
అదనంగా రూ.50 పైసలు రాయితీ పొందుతున్నారన్నారు. గాలి వేగం ఎక్కువగా ఉండి, ఎక్కువ విద్యుత్ జరిగే కర్ణాటకలో జగన్ కంపెనీకి యూనిట్‌కు రూ.5 కావాలని, ఏపీలో మాత్రం ముఖ్యమంత్రిగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. కర్ణాటకది కూడా ప్రజాధనమే అన్నారు. ఏపీలో అడుగుతున్న ధరకు కర్ణాటకలో జగన్ ఎందుకు సరఫరా చేయడం లేదన్నారు. జగన్ కూడా అవినీతికి పాల్పడే ధరలు ఖరారు చేయించుకున్నారా అని నిలదీశారు.

54 శాతం తెలంగాణకు వెళ్తుంది..
PPAలపై అధికారులు అబద్దాలు చెప్పారని చంద్రబాబు అన్నారు. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లు (RPPO) 5 శాతం ఉండాలని కేంద్రం చెబితే, గత ప్రభుత్వం 23.6 శాతం కొుగోలు చేసిందని అధికారం అవాస్తవాలు చెప్పారని, కానీ కేంద్రం నిర్దేశించిన RPPO దాటితే ప్రోత్సాహకాలు ఇస్తారని, అలా ఏపీకి రూ.236 కోట్లు వచ్చాయని చెప్పారు. కేంద్రం ప్రోత్సాహం వల్ల సగటు కొనుగోలు ధర తగ్గి, ప్రజలపై భారం తగ్గుతుందన్నారు. జీఎంఆర్‌కు ఇచ్చి ఉంటే రేట్లు తగ్గేవని చెబుతున్నారని, కానీ దానికి గ్యాస్ కేటాయింపులు లేవని చెప్పారు. ఇది కేంద్రం పరిధిలో ఉందన్నారు. ఒకవేళ జీఎంఆర్‌కు గ్యాస్ కేటాయించినా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 54 శాతం తెలంగాణకు, 46 శాతం ఏపీకి వెళ్తుందని, తెలంగాణపై ఉన్న ప్రేమ జగన్‌కు ఏపీపై ఎందుకు లేదన్నారు.

జగన్ ఎక్కువ ధరకు ఎందుకు కొన్నారు?
ఇప్పుడు సౌర విద్యుత్ యూనిట్‌కు రూ.2.72కు, పవన విద్యుత్ రూ.4.80కి తగ్గిందని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రభుత్వం వచ్చాకే ప్రజా ధనం వృథా అవుతోందన్నారు. ఈ నెల 11వ తేదీన ఏపీ ఒక యూనిట్ విద్యుత్‌ను రూ.4.90లకు కొన్నదని, అదే రోజు కర్ణాటక రూ.2. 70, కేరళ రూ.2. 99కి కొన్నాయని, 12వ తేదీన మనం రూ. 4. 09కి కొంటే కర్ణాటక రూ. 2.78కి, కేరళ రూ.3.12కు కొన్నాయని, ఇది అవినీతి కాదా అని ప్రశ్నించారు. పవన విద్యుత్ ధరల విషయంలో తమిళనాడుతో ఏపీకి పోలిక లేదనన్నారు. అక్కడ గాలి వేగం ఎక్కువ, విద్యుత్ ఎక్కువ అన్నారు. తక్కువ పెట్టుబడికి, ఎక్కువ విద్యుత్ వస్తుందన్నారు. గాలి వేగాన్ని బట్టి దేశాన్ని కేంద్రం కొన్ని జోన్లుగా విభజించి ఎక్కడ ఎంత ధరలు ఉండాలో సూచించిందన్నారు. వాటి ప్రకారమే రెగ్యులేటరీ కమిషన్లు ధరలు నిర్ణయిస్తాయన్నారు. 2017 వరకు ఈ విధానం అమల్లో ఉందన్నారు. ఆ తర్వాతే టెండర్ విధానం వచ్చిందన్నారు. సౌర, పవన విద్యుత్ ధరలు తగ్గించాలని తాము ప్రయత్నాలు చేశామని, కోర్టుకు వెళ్లామని, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications