మూడు రోజుల వరుస లాభాలకు మళ్లీ గట్టి బ్రేక్ పడింది. రెండు అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అనేట్టుగా సాగుతోంది స్టాక్ మార్కెట్ ట్రెండ్. బ్యాంక్స్ నీరసానికి తోడు ఆటో, రియాల్టీ, మెటల్ రంగ స్టాక్స్ కూడా తోడయ్యాయి. వీటిల్లో భారీ అమ్మకాల ఒత్తిడి నిఫ్టీని 11, 600 పాయింట్ల మార్కు దిగువకు తీసుకువచ్చింది. ఉదయం నుంచి ఏ దశలోనూ కోలుకున్న దాఖలాలు కనిపించలేదు. మార్కెట్ ప్రారంభంలో నిఫఅటీ 11677 స్థాయిని తాకింది. అదే ఈ రోజుకు గరిష్ట స్థాయి. అక్కడి నుంచి సెల్లింగ్ కొనసాగుతూనే వచ్చింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా రెండు శాతం వరకూ దిగొచ్చాయి. చివరకు 318 పాయింట్ల నష్టంతో 38897 దగ్గర సెన్సెక్స్, 91 పాయింట్ల నష్టంతో 11597 దగ్గర నిఫ్టీ క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 305 పాయింట్లు దిగొచ్చి 30430 వద్ధ స్థిరపడింది.
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.36 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.19 శాతం దిగొచ్చింది. ఇతర సెక్టోరల్ ఇండిసిస్‌లో కొన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా సంబంధ స్టాక్స్ మాత్రమే ఫరవాలేదనిపించాయి. ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతానికిపైగా కోల్పోయింది. ఆ తర్వాత ఆటో, మెటల్, రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ కూడా దిగొచ్చాయి.

ఈ రోజు మార్కెట్లో చివరకు హెచ్ డి ఎఫ్ సి, విప్రో, జీ ఎంటర్‌టైన్మెంట్, బ్రిటానియా, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
యెస్ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా మోటార్స్, మారుతి స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.
రూ.11కి వోడాఐడియా
దేశంలోని ప్రధాన టెలికాం దిగ్గజ సంస్థ షేర్ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. రూ.11 స్థాయికి దిగొచ్చేశాయి స్టాక్ ధరలు. సుమారు 20 లక్షల షేర్లు బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారడంతో ఈ స్టాక్ ఈ రోజు మరింతగా నీరసించింది. ఇంట్రాడేలో మరింతగా నీరసించినప్పటికీ చివరకు రూ.11.30 దగ్గర క్లోజైంది స్టాక్.
మైండ్ ట్రీకి రిజల్ట్స్ దెబ్బ
ఎల్ అండ్ టి బలవంతపు టేకోవర్ వ్యవహారంతో పాటు ఇండస్ట్రీ కష్టాలు ఎదుర్కొన్న మైండ్ ట్రీ ఊహించినట్టుగా నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆదాయంలో కేవలం 0.8 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ప్రాఫిట్ మార్జిన్లు కూడా 14 నుంచి 10 శాతానికి దిగిరావడం మరింతగా ఆందోళనలోకి నెట్టింది. వీటికి తోడు పాత యాజమాన్యం మొత్తం వైదలొగడంతో ఈ రోజు ఎల్ అండ్ టి ఏఎం నాయక్.. మైండ్ ట్రీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో ఈ స్టాక్ ఈ రోజు 10 శాతానికి పైగా పతనమైంది. చివరకు 8 శాతం నష్టంతో రూ.691 దగ్గర స్థిరపడింది.
తల్వాల్కర్ .. నాట్ ఫిట్
ప్రముఖ ఫిట్నెస్ ట్రైనింగ్ సంస్థ తల్వాల్కర్స్, తల్వాల్కర్స్ జిమ్ స్టాక్స్‌కు ఈ రోజు 20 శాతం డౌన్ సీలింగ్ పడ్డాయి. ఈ రెండు స్టాక్స్ వరుసగా నాలుగు రోజుల నుంచి నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. సాధారణ వాల్యూమ్స్ కంటే అధికంగా షేర్లు ట్రేడయ్యాయి. ప్రత్యేక కారణాలు ఇంకా తెలియరానప్పటికీ స్టాక్స్ మాత్రం పతనమవుతూనే ఉన్నాయి. తల్వాల్కర్స్ ఫిట్నెస్ రూ.39, తల్వాల్కర్స్ జిమ్ రూ.73 దగ్గర క్లోజయ్యాయి.
హెచ్ డి ఎఫ్ సి ఏఎంసి
మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన హెచ్.డి.ఎఫ్.సి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ నానాటికీ బలం పుంజుకుటోంది. మార్కెట్ నీరసంగా ఉన్నా మొదటి క్వార్టర్లో 42 శాతం లాభాల వృద్ధిని ఈ సంస్థ నమోదు చేసింది. దీంతో స్టాక్ ఈ రోజు కూడా సుమారు 5 శాతం పెరిగింది. చివరకు రూ.2170 దగ్గర క్లోజైంది. రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
యెస్ బ్యాంక్‌కు రిజల్ట్స్ దెబ్బ
నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలను వెల్లడించడంతో పాటు గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టాలను ప్రకటించిన నేపధ్యంలో యెస్ బ్యాంక్ స్టాక్ కుదేలవుతోంది. పెరిగిన ప్రొవిజన్స్, మొండిబకాయిల భారం కూడా కుదిపేస్తున్నాయి. దీంతో ఈ స్టాక్ 13 శాతం కోల్పోయి రూ.85.80 దగ్గర క్లోజైంది.
ప్రభుత్వ బ్యాంకుల్లో ఆందోళన
ప్రత్యేకమైన కారణాలేవీ లేనప్పటికీ ఈ మధ్య కొద్దో గొప్పో పెరిగిన ప్రభుత్వ బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి మరింతగా పెరిగింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనెరా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ స్టాక్స్ 4 శాతం వరకూ దిగొచ్చాయి. ఇదే బాటలో ప్రైవేట్ బ్యాంక్ స్పేస్‌లోని ఫెడరల్ బ్యాంక్ 4 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ 2 శాతం నీరసించాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications