స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా లాభాల పర్వం కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రోత్సాహక సంకేతాల నేపధ్యంలో మన మార్కెట్లు కూడా ఈ రోజు జోరును కనబర్చాయి. అయితే నిఫ్టీ పైకి లాభాల్లో కనిపిస్తున్నప్పటికీ స్టాక్స్‌లో మాత్రం అంత ఉత్సాహం లేదు. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆటో, ఫార్మా మినహా మిగిలిన సెక్టోరల్ సూచీలన్నీ లాభాల్లోనే ఉన్నాయి. ఉదయం 11670 పాయింట్ల దగ్గర ప్రారంభమైన నిఫ్టీ ప్రారంభంలోనే 11706 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ చేరింది. చివరకు సెన్సెక్స్ 85 పాయింట్ల లాభంతో 39216 దగ్గర, నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 11687 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 30735 దగ్గర స్థిరపడింది.
సెక్టోరల్ సూచీల్లో ఫార్మా, ఆటో నష్టాల్లో మిగిలిపోగా పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసిజి రంగాలకు కొనుగోళ్ల మద్దతు కనిపించింది.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జీ ఎంటర్‌టైన్మెంట్, యూపీఎల్, హిందాల్కో, ఎస్బీఐ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, గెయిల్, మారుతి, ఓఎన్జీసీ లూజర్స్ జాబితాలో నిలిచాయి.
కెఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు ఆర్డర్ బూస్ట్
హైదరాబాద్‌కు చెందిన కెఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు నవయుగ గ్రూప్ నుంచి సుమారు రూ.850 కోట్ల సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్డర్లు లభించాయి. ఈ నేపధ్యంలో ఈ స్టాక్ లాభాల్లో ముగిసింది. 5 శాతానికి పైగా లాభపడిన స్టాక్ చివరకు రూ.282 దగ్గర స్థిరపడింది.
నాలుగో రోజూ గాల్లోనే..
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో స్టాక్ వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలోనే పయనించింది. ప్రమోటర్ల మధ్య విబేధాలు తలెత్తిన నేపధ్యంలో గతవారం భారీగా పతనమైన స్టాక్ ఈ మధ్య మళ్లీ కోలుకుంటోంది. చివరకు స్టాక్ 1.5 శాతం పెరిగి రూ.1466 దగ్గర క్లోజైంది.
ఎంసిఎక్స్‌కు 6 రెట్ల లాభం
మల్టీకమోడిటీ ఎక్స్ఛేంజ్ స్టాక్ ఈ రోజు ఏకంగా 5 శాతం పెరిగి ఆశ్చర్యపరిచింది. వార్షిక పద్ధతిన సంస్థ నికర లాభం ఆరు రెట్లు పెరిగి రూ.43.7 కోట్లకు చేరింది. దీంతో స్టాక్ చివరకు 5.08 శాతం లాభాలతో రూ.855 దగ్గర క్లోజైంది.
ఎడిల్వైజ్ భారీ పతనం
యూఎస్‌కి చెందిన కోరా మేనేజ్మెంట్ సంస్థ ఎడిల్వైజ్ వెల్త్ మేనేజ్మెంట్‌లో 20 శాతం వాటాను రూ.2000 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్ అనూహ్యంగా పతనమైంది. ఇంట్రాడేలో రూ.153కి పడిపోయిన స్టాక్ చివరకు 7.5 శాతం నష్టాలతో రూ.161 దగ్గర క్లోజైంది.
ఐఆర్‌బీ ఐదు రోజుల తర్వాత తేరుకుంది
వరుసగా ఐదు రోజులుగా నష్టాలతో సతమతమవుతున్న స్టాక్ ఈ రోజు కాస్త తేరుకుంది. ఇంట్రాడేలో సుమారు పది శాతం లాభపడి రెండు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే చివర్లో కొద్దిగా లాభాల స్వీకరణ వచ్చినప్పటికీ స్టాక్ 5.5 శాతం పెరిగింది. చివరకు రూ.91.45 దగ్గర క్లోజైంది.
టాటా ఎలక్సీకి రిజల్ట్స్ షాక్
ఈ సంస్థ నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆదాయంలో 5.3 శాతం, నికర లాభంలో 31 శాతం క్షీణతను నమోదు చేసింది. ఎబిటా మార్జిన్లు కూడా 10 శాతం వరకూ తగ్గడం ఆందోళన కలిగించింది. దీంతో స్టాక్ ఏకంగా 10 శాతానికి పైగా పతనమైంది. చివరకు 9 శాతం డౌన్‌తో రూ.742 దగ్గర స్టాక్ క్లోజైంది.
More From GoodReturns

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications