For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPA: 'ఆత్మరక్షణలో.. అదే ధరకు కర్ణాటకకు జగన్ కంపెనీ సండూర్ పవర్ విక్రయం'

|

అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPA) సమీక్ష సరికాదని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, కచ్చితంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లోను దాదాపు అలాగే ఉన్నాయనే వాదన కూడా ఉంది. ఎలాంటి ఆరోపణలు లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా సమీక్షిస్తే పెట్టుబడులు, అభివృద్ధిపై ప్రభావం పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వంపై అధిక భారం పడుతోందని జగన్ ప్రభుత్వం చెబుతోంది.

మాపై రూ.2,500 కోట్ల భారం, మేం భరించాలా: కేంద్రానికి జగన్ నో మాపై రూ.2,500 కోట్ల భారం, మేం భరించాలా: కేంద్రానికి జగన్ నో

కర్ణాటకతో సండూర్ పవర్ ఒప్పందం

కర్ణాటకతో సండూర్ పవర్ ఒప్పందం

ఏపీలో బహిరంగ మార్కెట్లో రూ.2 లోపే యూనిట్ కరెంట్ వస్తుంటే, చంద్రబాబు సర్కార్ రూ.4 కంటే ఎక్కువకు పీపీఏలు కుదుర్చుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే అదే సమయంలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ కుటుంబానికి చెందిన సండూర్ పవర్ లిమిటెడ్ అంశాన్ని ఆయన లాగారు. కర్ణాటక ప్రభుత్వంతో సండూరు పవర్ ఒక యూనిట్ విద్యుత్‌కు రూ.4.50కు ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ (PLF) ఏపీ కంటే 3 శాతం ఎక్కువ అని, అందుకే మన వద్ద 33 పైసలు తక్కువగా ఉందన్నారు.

రూ.2 కంటే తక్కువకు వస్తుందని, రూ.4.50కు విక్రయం

రూ.2 కంటే తక్కువకు వస్తుందని, రూ.4.50కు విక్రయం

PLFను మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లోను ఏపీలో ఇస్తున్నట్లే ఒప్పందాలు చేసుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం జగన్‌కు చెందిన సండూర్ పవర్‌కు ఎంత చెల్లిస్తుందో, ఏపీ కూడా దాదాపు అంతే చెల్లిస్తోందని అభిప్రాయపడ్డారు. రూ.2 కంటే తక్కవకు విద్యుత్ వస్తుందని చెబుతున్న జగన్, తన విద్యుత్‌ను రూ.4.50కు విక్రయిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. కర్ణాటకతో విద్యుత్ అమ్మకానికి ఎంత మొత్తంతో జగన్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుందో అంతే మొత్తంతో పీపీఏలు కుదుర్చుకుంటే ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

సండూర్ పవర్ కోసమేనా?

సండూర్ పవర్ కోసమేనా?

పీపీఏలు సమీక్షించవద్దని కేంద్రం చెప్పిందని, తద్వారా ఇది రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) ఆధ్వర్యంలో పీపీఏలు జరుగుతాయని, విద్యుత్ కంపెనీలు, డిస్కంలు, ప్రజలు.. ఇలా అన్ని పార్టీల వాదనలు విని ERCనే ధరను నిర్ణయిస్తుందన్నారు. అసలు పీపీఏల పునఃసమీక్, సండూర్ కోసమేనా అని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.

English summary

PPA: 'ఆత్మరక్షణలో.. అదే ధరకు కర్ణాటకకు జగన్ కంపెనీ సండూర్ పవర్ విక్రయం' | Is YSRCP government trying towriggle out of PPAs issue?

The YSRCP government was trying for damage control in the issue of PPAs after realising the stand of the Centre, said TDP MLA Leader.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X