స్టాక్ మార్కెట్ పడిపోతోంది, బంగారం ధర పెరుగుతోంది, రియల్ ఎస్టేట్‌ను పట్టుకోవడానికి వల్ల కావడం లేదు. బాండ్స్‌లో పెడితే ఎప్పుడేం జరుగుతోందో తెలియని స్థితి. ఇలా వివిధ పెట్టుబడి సాధనాలన వైపు చూసేందుకు జనాలకు ధైర్యం చాలడం లేదు. అయితే మరి డబ్బును బ్యాంకుల్లోనే దాచుకుందామా అంటే నాలుగైదు శాతానికి మించి రాబడి లేదు. అయితే ఇలాంటి వాళ్లకోసమే శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ ఓ కొత్త డిబెంచర్ ఆఫర్‌తో ముందుకు వస్తోంది.

శ్రీరామ్ ట్రాన్సుపోర్ట్
శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ తాజాగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్.సి.డి)ను ఆఫర్ చేస్తోంది. రూ.300 కోట్ల బేస్ సైజ్‌తో రూ.10 వేల కోట్ల వరకూ వచ్చే సబ్‌స్క్రిప్షన్‌ను తమ దగ్గరే ఉంచుకునేలా అనుమతి తెచ్చుకుంది శ్రీరాం. అంటే ఈ డిబెంచర్ల జారీ ద్వారా రూ.10 వేల కోట్ల వరకూ నిధులను సమీకరించబోతోందీ సంస్థ. జూలై 17వ తేదీన ప్రారంభమయ్యే ఆ డిబెంచర్లకు 30 నెలలు, 42 నెలలు, 60 నెలలు, 82 నెలల కాల పరిమితి ఉండనుంది. అవసరాన్ని బట్టి నెలనెలా లేదా ఏడాదికి వడ్డీని మన ఖాతాల్లోనే జమ చేస్తారు.
ఎన్.సి.డి.ల ద్వారా వార్షికంగా 9.7 శాతం వరకూ గరిష్టంగా రాబడి (వడ్డీ)ని పొందే వీలుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే అదనంగా మరో పావు శాతం వరకూ వడ్డీని అధికంగా ఆర్జించవచ్చు.
నెలనెలా లేదా కొంత కాలానికి నికర ఆదాయాన్ని కోరుకునేవారికి (ఫిక్సెడ్ ఇన్‌కం) ఇది ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి బ్యాంకుల్లో డిపాజిట్లు గరిష్టంగా 7 నుంచి 7.5 శాతం వడ్డీని ఇస్తున్న తరుణంలో ఇలాంటి డిబెంచర్లు 9 శాతానికిపైగా వడ్డీని ఇస్తున్నారు. రివార్డ్ ఎక్కువగా ఉంది కాబట్టి రిస్క్ కూడా కొద్దో గొప్పో ఉంటుందనే సంగతిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వీటికి ఏఏ ప్లస్ రేటింగ్ ఉంది. అంటే శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ సంస్థ ఇప్పుడు ఆర్థికంగా పరిపుష్టంగా ఉందనే అర్థం.

రిస్క్ ఉందా
సాధారణంగా బాండ్స్, డిబెంచర్స్‌కు కొద్దో గొప్పో రిస్క్ ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఇలా మన దగ్గర నుంచి కొంత వడ్డీకి నిధులను సమీకరించి, దాంతో అధిక వడ్డీకి రుణాలను ఇచ్చి తద్వారా వీళ్లు లాభాలను పొందుతారు. అదే బిజినెస్ మోడల్. అయితే ఈ క్రమంలో ఎవరైనా డిఫాల్ట్ అయినా (రుణాలు ఎగ్గొట్టినా), బిజినెస్ డల్ అయిపోయినా, ఆర్థికంగా ఏదైనా అనిశ్చితి వచ్చినా, ఆర్థిక వ్యవస్థే ఇబ్బందుల్లో ఉన్నా.. ఈ కంపెనీపై కూడా ప్రభావం ఉంటుంది. అంటే రిస్క్ ఉండడానికి వివిధ కారణాలుంటాయి. దాన్ని మనం దృష్టిలో ఉంచుకునే పెట్టుబడులు పెట్టొచ్చు.

ఇన్వెస్ట్ చేయొచ్చా
బ్యాంకులతో పోలిస్తే రెండు శాతానికిపైగా అధికంగా వడ్డీని ఈ డిబెంచర్ల ద్వారా శ్రీరాం అందిస్తోంది. ఆ లెక్కన ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. అయితే పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి నెలవారీ ఆదాయాన్ని పొందాలనుకునే వారికి మాత్రమే ఇది పనికొస్తుంది. అదే సమయంలో మనం పెట్టుబడి పెట్టాలనుకునే మొత్తంలో ఇలాంటివాటికి కేవలం 10 శాతం మాత్రమే కేటాయించాలి. అంటే మనం రూ.100 పెట్టుబడి పెడ్తామని అనుకుంటే, అందులో 10 రూపాయలు మాత్రమే వీటికి కేటాయించాలి. అఫ్పుడే రిస్క్ తక్కువగా ఉంటుంది. అది కూడా మన ఇన్‌కం ట్యాక్స్‌లో తక్కువ ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉంటేనే రిటర్న్స్ వర్కవుట్ అవుతాయి. చివరగా ఒక మాట. పెట్టుబడులు పెట్టేముందు మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎడ్వైజర్‌ను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications