ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. ఆర్బీఐ నిబంధనలు పాటించనందుకు సోమవారం నాడు SBIకి రూ.7 కోట్ల జరిమానా విధించింది. ఆస్తుల వర్గీకరణ, ఓపెనింగ్ అకౌంట్స్, ఆపరేటింగ్ కరెంట్ అకౌంట్స్ నిర్వహణ, లార్జ్ క్రెడిట్స్ డాటాకు సంబంధించిన అంశాల్లో ఎస్బీఐ నిబంధనలు పాటించలేదని ఆర్బీఐ చెబుతోంది.
మొండిపద్దుల గుర్తింపు, ప్రాండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ నిబంధనలు కూడా పాటించలేదని ఆర్బీఐ గుర్తించింది. ఫ్రాడస్టర్స్‌కు సంబంధించిన క్లాసిఫికేషన్, నివేదిక లేదని గుర్తించింది. మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)కు సంబంధించి నిబంధనల ఉల్లంఘనకుగాను పాల్పడినందుకు గాను జరిమానా విధించినట్లు సోమవారం ఆర్బీఐ తెలిపింది.

ఇప్పటికే మొండి బకాయిల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే ఎస్బీఐ అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో బ్యాంక్ ఇంకా ఏమరుపాటుగా ఉండటం ఆర్బీఐ ఆగ్రహానికి కారణమైంది. ఆదాయ ధ్రువీకరణ, ఆస్తుల వర్గీకరణ, కొత్త ఖాతాలు, ప్రస్తుత ఖాతాల నిర్వహణ వంటి విషయాల్లో ఎస్బీఐ పాటించలేదని ఆర్బీఐ చెబుతోంది.
2017 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఆ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ గతంలో యూనియన్ బ్యాంకు పైన రూ.10 లక్షల జరిమానా విదించింది.


Click it and Unblock the Notifications