ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌కు భారీ షాక్ తగిలింది. వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా అమెజాన్ మంచి ఆఫర్లతో సోమవారం యాన్యువల్ సేల్‌ను ప్రకటించింది. ప్రైమ్ సర్వీస్ మెంబర్స్‌కు ఈ డిస్కౌంట్స్ ఇస్తోంది. ఇదే సమయంలో వేలాదిమంది ఉద్యోగులు తమకు వేతనాలు సరిగా లేవని ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వేతనాలతో పాటు పని పరిస్థితులు షరతులపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల ఆందోళన
జర్మనీలో 2,000 మంతి వర్కర్స్ ఆందోళనల్లో పాల్గొన్నారని, అలాగే అమెరికాలోను నిరసన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. మిన్నెసోటా సెంటర్‌లో ఆరు గంటల పాటు పనిని నిలిపేశారు. యూకేలో వారం రోజుల పాటు నిరసనలు తెలపాలని నిర్ణయించారు. శాన్‌ప్రాన్సిస్కో, సియాటెల్, మిన్నెసోటాలోని కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు.

మనుషులుగా చూడాలి
మరోవైపు, దీనిపై అమెజాన్ స్పందిస్తూ తాను మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు, సేఫ్, రిలయేబుల్ జాబ్స్‌ను వర్కర్స్ కోరుకుంటున్నారని ఓ పిక్కర్ తెలిపారు. తాము ఎంతో వేగంగా డెలివరీ చేస్తున్నామని, తాను దాదాపు గంటకు 332 ఐటమ్స్ పికప్ చేసుకుంటానని, రోజుకు పది గంటలు పని చేస్తానని, మెంటల్‌గా, ఫిజికల్‌గా తాము వేగంగా పని చేస్తామని, కొన్ని సందర్భాల్లో తమకు దెబ్బలు కూడా తగులుతాయని అతను అన్నారు. ఇంత కష్టపడుతున్న తమను మనుషులుగా చూడాలని కోరుకుంటున్నామని, మెషీన్లుగా చూడవద్దన్నారు.

వసతులు లేవు
1 ట్రిలియన్ డాలర్లుకు పైగా సంపదతో ఉన్న అమెజాన్‌లో ఉద్యోగులు తమకు సరైన వేతనాలు లభించడం లేదని, కనీసం బాత్రూం విరామం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారట. కార్మికుల హక్కులు పరిరక్షించాలని కోరుతూ రెండు లక్షల 70వేల మంది సంతకాలతో ఓ పిటిషన్‌ను కూడా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఇంటికి పంపించనున్నారట.

అమెజాన్ బిగ్గెస్ట్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫాం
కాగా, అమెజాన్ ప్రైమ్ డే సేల్ సోమవారం నాడు ప్రారంభమైంది. 48 గంటల పాటు ఈ ఆఫర్ ప్రకటించారు. ప్రపంచంలోనే అమెజాన్ బిగ్గెస్ట్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్ ఫాం. 2018 వివరాల ప్రకారం... అమెజాన్ ద్వారా 45 శాతం, ఈబే ద్వారా 6.8 శాతం వాల్‌మార్ట్ ద్వారా 4 శాతం, ఆపిల్ ద్వారా 3.8 శాతం, హోమ్ డిపోట్ ద్వారా 1.6 శాతం, బెస్ట్ బై ద్వారా 1.3 శాతం, ఇతర ఆన్‌లైన్ సైట్ల ద్వారా 37 శాతం అమ్మకాలు ఉన్నాయి. జర్మనీలో అమెజాన్‌కు 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. జర్మనీలోని ఏడు సైట్‌లలో రెండువేల మంది నిరసనలకు దిగారు. మా ఆదాయాలపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్స్ లేవు అనే నినాదాలతో నిరసన తెలుపుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications