బెంగళూరు: క్వార్టర్ వన్ ఫలితాలు బాగుండటంతో ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం నాడు భారీ లాభాల్లో ముగిశాయి. ఏకంగా 7.20 శాతం పెరిగి, మార్కెట్ వ్యాల్యూ రూ.17,636 కోట్లు పెరిగింది. జూన్ త్రైమాసికంలో నికర లాభం మార్కెట్ అంచనాలకు మించి వచ్చింది. దీంతో ఇన్ఫోసిస్ షేర్లు దూసుకెళ్లాయి.
గత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ఆర్జించిన రూ.3,612 కోట్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో నికర లాభం 5.3 శాతం పెరిగి, రూ.3,802 కోట్లకు చేరుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను కూడా పెంచింది ఇన్ఫోసిస్. గతంలో అంచనా వేసిన 7.5 శాతం నుంచి 9.5 శాతం నుంచి 8.5 శాతం నుంచి 9 శాతానికి ఆదాయ వృద్ధి ఉండొచ్చని ప్రకటించింది.
BSEలో ఇన్ఫోసిస్ షేరు సోమవారం 7.20 శాతం పెరిగి రూ.779.45 వద్ద క్లోజ్ అయింది. గత ముగింపు ధర రూ.727.10తో పోలిస్తే రూ.762 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 7.46 శాతం పెరిగి రూ.781.40 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ షేరుకు 52 వారాల గరిష్ఠ స్థాయి ఇది.

మంగళవారం కూడా ఇన్ఫోసిస్ దూకుడుగానే ఉంది. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి సోమవారం కంటే 4.15 శాతం పెరిగి రూ.783.50 వద్ద ట్రేడ్ అయింది. సుమారు 11.68 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.17,636 కోట్లు పెరిగి, రూ.3,34,777.08 కోట్లకు చేరుకుంది. NSEలోను 7.24 శాతం పెరిగి రూ.779.40 వద్ద స్థిరపడింది. 3 కోట్ల షేర్లు చేతులు మారాయి.
కాగా, ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ... అంచనాలకు అనుగుణంగా మెరుగైన ఫలితాలను మూడు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. జూన్ తో ముగిసిన తోలి త్రైమాసికంలో (క్యూ1) బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇన్ఫోసిస్... నికర లాభం గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే 5% పెరిగి రూ 3,802 కోట్లకు చేరింది. అయితే, సీక్వెన్షియల్ పధ్ధతి లో చూస్తే మాత్రం కంపెనీ లాభం 6.8% తగ్గడం గమనార్హం.
మార్కెట్ అనలిస్టులు ఇన్ఫోసిస్ నికర లాభం సుమారు రూ 3,700 కోట్ల నుంచి రూ 3,800 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. అందుకు తగ్గట్లే ఇన్ఫోసిస్ క్యూ1లో మెరుగైన పనితీరును కనబరిచింది. కాగా, ఈ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయం రూ 21,803 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే త్రైమాసిక ఆదాయం రూ 19,128 కోట్లతో పోల్చితే ఇది ఏకంగా 14% అధిక కావడం విశేషం. సీక్వెన్షియల్ పద్ధతిలోనూ అమ్మకాలు 1.2% పెరిగాయి.


Click it and Unblock the Notifications