న్యూఢిల్లీ: జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF), ఇతర సారూప్య ఫండ్స్‌పై ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించింది. ఆర్థిక వ్యవస్థలో సాధారణ వడ్డీ రేట్ల తగ్గింపులో భాగంగా వీటిపై కూడా అదే నిర్ణయం తీసుకుంది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికానికి గాను జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర సారూప్య ఫండ్స్‌కు సబ్‌స్క్రైబర్లకు 7.9 శాతం వడ్డీ రేటును చెల్లిస్తారు. ఇంతకుముందు త్రైమాసికంలో 8 శాతంగా చెల్లించారు. కేవలం 0.01 శాతం తగ్గించారు.

ఎవరికి వర్తిస్తుంది?
ఈ వడ్డీ రేట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రైల్వే ఉద్యోగులకు, డిఫెన్స్ ఫోర్సెస్‌కు వర్తిస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటుకు అనుగుణంగా ఇందులో మార్పులు ఉంటాయి. ఈ మేరకు ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1 జూలై 2019 నుంచి 30 సెప్టెంబర్ 2019 వరకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర సారూప్య ఫండ్స్‌కు 7.9 శాతం వడ్డీ రేటు ఉంటుందని పేర్కొంది.

సంబంధిత సంస్థలు
- జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జనరల్ సర్వీసెస్)
- కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా)
- ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్
- స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్
- జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిపెన్స్ సర్వీసెస్)
- ఇండియన్ అర్డ్‌నెన్స్ డిపార్టుమెంట్ ప్రావిడెంట్ ఫండ్
- ఇండియన్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్
- ఇండియన్ నేవీ డక్‌యార్డ్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్
- డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్
- ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్

3 త్రైమాసికాలుగా లేని మార్పు
ప్రభుత్వం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి గాను GPF వడ్డీ రేటును పెంచింది. అప్పటి నుంచి వాటిలో మార్పు లేదు. జనవరి - మార్చి, ఏప్రిల్ - జూన్ త్రైమాసికాల్లో మార్పులేదు. ఇంతకుముందు, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పైన వడ్డీ రేటును జూలైకు క్వార్టర్‌కు గాను 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అన్ని వడ్డీ రేట్ల తగ్గింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications