పెట్రోల్, డీజిల్ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఇలా వాహనదారుల నుంచి వచ్చే సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు కూడా మళ్లిస్తోంది. పెట్రోల్, డీజిల్ పైన సెస్‌గా విధించే సొమ్ము నుంచి 2018-19, 2019-20లలో రూ.17,000 కోట్లు ఇతర మార్గాలకు మళ్లించిందట. ఇటీవల బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ పైన రూ.1 అదనంగా సెస్ విధించిన విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది అంచనా రూ.1.27 ట్రిలియన్లు
పెట్రోల్, డీజిల్ సెస్ ద్వారా వచ్చే సొమ్మును సెంటర్ రోడ్డు అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF)కు మళ్లుతాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ సెస్ ద్వారా ప్రభుత్వానికి రూ.1.13 ట్రిలియన్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికే బడ్జెట్‌లో రూ.1 సెస్ విధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.27 ట్రిలియన్లు వస్తాయని అంచనా. కానీ ఈ మొత్తాన్ని అటు మళ్లించడం లేదు.

అభివృద్ధి కోసం నిధుల మళ్లింపు
2018-19లో రూ.9వేల కోట్లకు పైగా, 2019-20లో దాదాపు 8వేల కోట్లు మళ్లిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఎటు మళ్లించారనే పేర్కొనలేదు. అయితే నవోదయ పాఠశాలలకు వీటి నుంచి ప్రభుత్వం దాదాపు రూ.3వేల కోట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు నిధుల కొరత ఉంది. దీంతో ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. అప్పుడు టోల్ ట్యాక్స్ రూపంలో వాహనదారుల నుంచి కొంతమొత్తం వసూలు చేస్తారు. అలాగే, పెట్రోల్, డీజిల్ పైన వచ్చే సర్ ఛార్జీని ప్రభుత్వం తనకు నచ్చిన అభివృద్ధి పనులకు కేటాయించవచ్చు.

పెట్రోల్ ధర ఇలా పెరుగుతుంది..
ఉదారణకు.. జూలై 6, 2019 బ్యారెల్ పెట్రోల్ ధర 58.72 డాలర్లు లేదా రూ.4,019 గా ఉంది. అంటే లీడర్ ధర రూ.25.27. బేసిక్ OMC (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) కాస్ట్ కాలిక్యులేషన్ ప్రకారం.. ఎంట్రీ ట్యాక్స్, రిఫైనర్ ప్రాసెసింగ్, ఓఎంసీ మార్జిన్, ఫ్రీట్ కాస్ట్, లాజిస్టిక్ అన్నీ కలిపి పెట్రోల్ లీటర్‌కు రూ.8.64. అంటే అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.33.91 అవుతుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వేసే ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్ రూ.19.98. అప్పుడు దీని ధర రూ.53.89. ఢిల్లీ ప్రకారం పెట్రోల్ పంప్ డీలర్స్ కమిషన్ రూ.3.56. అప్పుడు దీని ధర రూ.57.45. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు వేసే వ్యాట్ ప్లస్ 25 పైసలు పొల్యూషన్ సెస్, సర్‌చార్జ్ రూ.15.51. దీంతో పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.72.96గా ఉంది. వ్యాట్ కూడా రాష్ట్రాన్ని బట్టి మారుతుంది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications