ఈ రోజు ఐటీ స్టాక్స్ ఒంటిచేత్తో మార్కెట్‌ను నిలబెట్టాయి. బ్యాంకింగ్ స్టాక్స్ మార్కెట్లను వెనక్కిలాగుతున్నప్పటికీ నిఫ్టీ మాత్రం ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ మద్దతుతో పైన నిలిచింది. గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు వారం ప్రారంభంలోనూ అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. పేరుకు నిఫ్టీ లాభాల్లో ముగిసినప్పటికీ అధిక శాతం స్టాక్స్ మాత్రం నష్టాల్లోనే ముగిశాయి. ఇంట్రాడేలో 11618 పాయింట్ల గరిష్ట స్థాయి వరకూ వెళ్లిన నిఫ్టీ చివరకు 11600 పాయింట్ల దిగువనే ముగిసింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా ఒక్క శాతం వరకూ కోల్పోయాయి. చివరకు నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 11588 దగ్గర, సెన్సెక్స్ 160 పాయింట్లు పెరిగి 38,896 దగ్గర ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 30446 దగ్గర క్లోజైంది.
సెక్టోరల్ సూచీల పరంగా చూస్తే ఐటీ, ఫార్మా, ఆటో మాత్రమే లాభపడగా మిగిలినవన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, యూపీఎల్, టెక్ మహీంద్రా, మారుతి టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, భారతి ఎయిర్టెల్, యెస్ బ్యాంక్ లూజర్స్ జాబితాలో చేరాయి.

బ్యాంక్స్ నీరసం
ఈ రోజు ప్రభుత్వ - ప్రైవేట్ బ్యాంకుల స్టాక్స్ తీవ్రంగా నష్టపోయాయి. వాస్తవానికి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నష్టంతో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్.. పాత్ర 70 శాతం వరకూ ఉంది.
వీటితో పాటు ఆర్బీఎల్ బ్యాంక్ 5.5 శాతం నష్టపోగా, ఇండస్ ఇండ్ రెండున్నర శాతం, ఐసిఐసిఐ బ్యాంక్ ఒక్క శాతానికిపైగా నీరసించింది.
పీఎస్‌యూ బ్యాంక్స్‌లో ప్రధానంగా అలహాబాద్ బ్యాంక్ 8 శాతం, యూనియన్ బ్యాంక్ 4.5 శాతం, కెనెరా బ్యాంక్ 4 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 శాతం వరకూ కోల్పోయాయి. నిఫ్టీ పిఎస్‌యూ ఇండెక్స్ ఏకంగా రెండున్నర శాతం వరకూ దిగొచ్చింది.
ఇన్ఫోసిస్.. ఒంటి చేత్తో..
మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ఇన్ఫోసిస్.. భారీగా లాభపడింది. ఈ ఏడాది ఆదాయ అంచనాలను అనూహ్యంగా పెంచిన నేపధ్యంలో ఈ స్టాక్‌కు బూస్టింగ్ లభించింది. గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు భారీగా లాభపడింది. చివరకు 7.2 శాతం లాభంతో రూ.779.50 దగ్గర స్టాక్ క్లోజైంది.
పిరమల్‌కు క్రిసిల్ కిక్
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ రేటింగ్‌ను క్రిసిల్ పెంచడం కలిసొచ్చింది. గత కొద్దికాలం నుంచి నీరసంగా ఉన్న స్టాక్ మళ్లీ పుంజుకుని నెల రోజుల గరిష్ట స్థాయికి చేరింది. సాఫ్ట్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పిరమల్ త్వరలో సుమారు రూ.9600 కోట్ల నిధుల సమీకరణ చేపట్టబోతోంది. రెండు గుడ్ న్యూస్ ఒకే సారి రావడంతో స్టాక్ మళ్లీ రెండు వేల మార్కును దాటింది. చివరకు రూ.2078 దగ్గర క్లోజైంది, 7 శాతానికి పైగా లాభాలతో.
మాగ్మా ఫిన్ కార్ప్ నష్టాల మసి
స్టాక్ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లో ముగిసి షేర్ హోల్డర్ల సహనాన్ని పరీక్షిస్తోంది. సంస్థకు చెందిన అసెట్ బ్యాక్డ్ ఫైనాన్స్ బిజినెస్ సీఈఓ కౌశిక్ ఎనర్జీ వ్యక్తిగత కారణాలతో సీఈఓగా వైదొలిగారు. ఈ నేపధ్యంలో స్టాక్ 7 శాతం కోల్పోయి రూ.100 దిగువన ముగిసింది.
ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ ఫ్యూచర్ ఏంటో
ఈ సంస్థకు చెందిన సీఈఓ దినేష్ మహేశ్వరిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది. రూ.15 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేతతో కీలక సూత్రధారిగా అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలో మరో పెద్ద గ్రూపు అయిన ఫ్యూచర్ పై కూడా అనుమానాలు రేగాయి. దీంతో స్టాక్ ఒక్కసారిగా కుప్పకూలింది. 5 శాతం దిగొచ్చి రూ.32.25 దగ్గర క్లోజైంది. ఇదే గ్రూపునకు చెందిన ఇతర స్టాక్స్ కూడా ఇలానే రియాక్ట్ అయ్యాయి.
డిహెచ్‌ఎఫ్ఎల్‌కు నష్టాల దెబ్బ
దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ స్టాక్ ఏకంగా పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. సంస్థ ఏర్పాటు తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఏకంగా రూ.2500 కోట్ల నష్టాన్ని ప్రకటించారు. దీనికి తోడు సంస్థ మనుగడపై యాజమాన్యానికే నమ్మకం లేకపోవడం మరింత ఆందోళనలోకి నెట్టింది. దీంతో స్టాక్ ఈ రోజు ఏకంగా 30 శాతానికిపైగా కోల్పోయింది. చివరకు రూ. 48.50 దగ్గర క్లోజైంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications