ముంబై: ఇండిగో ప్రమోటర్స్ మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండిగో బోర్డు మెంబర్స్ కొందరు.. కో-ఫౌండర్ రాకేష్ గాంగ్వాల్‌ను వచ్చే వారం ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఇండిగో గవర్నెన్స్ లోపాలపై సెబీ, కార్పోరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. బోర్డు సభ్యులు, పలువురు ఉన్నతాధికారులకు సెబి సమన్లు జారీ చేయనుంది. ఇండిగో మదర్ కంపెనీ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్లో అమలు అవుతున్న ఒప్పందాలు, జరిగిన ఏర్పాట్లపై ఓ ప్రమోటర్ ఆరోపణలు చేసినందున, వాటిని క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పైన సెబీ ఆరా తీస్తోంది. నిర్వహణ లోపాలపై లోతుగా దర్యాఫ్తు చేస్తోంది.
2015లో లిస్టైన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్‌లో సెబి నిబంధనలు అతిక్రమణకు గురవుతున్నాయనే అరోపణలు వచ్చాయి. కో-ప్రమోటర్ రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్ గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ సంస్థలు నిర్వహించిన ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పదంగా ఉన్నాయని మరో ప్రమోటర్ రాకేష్ గాంగ్వాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిని రాహుల్ భాటియా ఖండించారు. అయితే ఆరోపణలకు సమగ్ర వివరణ కావాలని కంపెనీని కార్పోరేట్ వ్యవహారాల శాఖ కోరింది. అతిక్రమణలు వెలుగుచూస్తే చర్యలు తీసుకుంటారు.

ఇండిగో ప్రారంభం నుంచి ప్రమోటర్ల గ్రూప్స్ మధ్య పారదర్శకత ఉందని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ (IGE) తెలిపింది. గంగ్వాల్ ఓ పరిమిత స్వభావి అని, స్వార్థపరుడని విమర్శించింది. సంస్థ ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోలేదని, అవసరమైతే ఆస్తులను అమ్మేద్దామనే ప్రతిపాదనలు చేసేవాడని, ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ వివాదాలను సృష్టించాడని ఆరోపించింది. రెండు గ్రూప్స్ ఎంతెంత పెట్టుబడి పెట్టాయో పూర్తి వివరాలు ఉన్నాయని తెలిపింది.
ఇండిగో ఈక్విటీలో రాకేష్ గంగ్వాల్, అతని ఫ్యామిలీకి 37%, రాహుల్ భాటియా, అతని కుటుంబ నిర్వహణలోని ఐజీఈ గ్రూప్‌నకు 38% వాటా ఉంది. ఈక్విటీలో 38 శాతం వాటాతో ఐజీఈ గ్రూప్, ఇండిగో ఎండీ, సీఈఓ, ప్రెసిడెంట్‌తో పాటు ఆరుగురు డైరెక్టర్లలో ముగ్గుర్ని నియమించే అధికారం చలాయిస్తోందని గంగ్వాల్ ఆరోపించారు. ఈ మేరకు సెబికీ లేఖ రాశాడు.
2005 నవంబరులో ఎయిర్‌బస్ నుంచి విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నపుడు కనీసం 50 మిలియన్ డాలర్ల చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు ఐజీఈ గ్రూప్ తెలిపింది. కానీ నష్టభయంతో గంగ్వాల్ ముందుకు రాలేదని, ఐజీఈ ఒక్కటే మరో రూ.110 కోట్ల వరకు పెట్టుబడి పెట్టిందని పేర్కొంది.
కపిల్ భాటియా, రాహుల్ భాటియాలు ప్రారంభం నుంచి ఇండిగోకు వ్యక్తిగత రుణాలు ఇవ్వడమే కాక, బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చారని తెలిపింది. 2005-06లో రూ.143 కోట్ల గ్యారెంటీ ఇవ్వగా, 2009-10 నాటికి ఈ మొత్తం రూ.1100 కోట్లు పెరిగిందని, కానీ గంగ్వాల్ ఇచ్చింది రూ.15 కోట్లు లోపే అని తెలిపింది. 2012 వరకు కపిల్, రాహుల్ వ్యక్తిగత గ్యారెంటీలు ఇచ్చారని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications