ఎవరు క్లెయిమ్ చేసుకోని (ఆన్ క్లెయిమ్డ్) డిపాజిట్లు బ్యాంకుల వద్ద కుప్పలుతెప్పలుగా పెరిగిపోతున్నాయి. బీమా కంపెనీల వద్ద కూడా ఈ సొమ్ము వేల కోట్ల రూపాయల్లో ఉంది. ఈ సొమ్ము క్రమంగా పెరిగిపోవడానికి కారణాలేంటి? ఒకవేళ ఆన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉంటే వాటిని పొందడం ఎలా? వంటి విషయాలు తెలుసుకుందాం..

అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ అంటే?
* పదేళ్ల పాటు ఏదైనా బ్యాంకు ఖాతాలో లావాదేవీలు నిర్వహంచకపోతే దాన్ని అన్ క్లెయిమ్డ్ ఖాతా గా పరిగణిస్తారు. ఆ ఖాతాలో ఉన్న సొమ్ము అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ అవుతుంది. బీమాకు సంభందించిన సొమ్మును క్లెయిమ్ చేసుకోక పోయినా అది నిర్దేశిత కాలం తర్వాత అన్ క్లెయిమ్డ్ సొమ్ముగా పరిగణిస్తారు.

ఎంత సొమ్ము పోగయిందంటే?
* ఇప్పటిదాకా బ్యాంకులవద్ద అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు, బీమా కంపనీల వద్ద ఉన్న అన్ క్లెయిమ్డ్ సొమ్ము రూ.32,000 కోట్లకు పైగా ఉంది.
* ఎస్బీఐతో పాటు మరిన్ని జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, బీమా కంపెనీల వద్ద ఈ సొమ్ము ఉంది.
* బ్యాంకుల వద్ద 2016 సంవత్సరంలో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.8,928 కోట్లు ఉండేవి. 2018 సంవత్సరంలో ఇవి రూ. 14,578 కోట్లకు పెరిగాయి.
* 2018 సెప్టెంబర్ 30 నాటికి జీవిత బీమా కంపెనీల వద్ద రూ.16,887.66 కోట్లు, జీవిత బీమాయేతర కంపెనీల వద్ద రూ. 989.62 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.

ఈ సొమ్మును ఏం చేస్తారు?
* బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి సవరణలు చేసి భారత రిజర్వ్ బ్యాంక్ .. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ ను ఏర్పాటు చేసింది.
* దీని ప్రకారం బ్యాంకులు పదేళ్లకు మించిన ఖాతాలను గుర్తించి వాటిలో ఎంత సొమ్ము ఉన్నదో లెక్కించాలి. ఈ సొమ్మును వడ్డీతో కలిపి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ కు బ్యాంకులు బదిలీ చేయాల్సి ఉంటుంది.
* ఈ సొమ్మును డిపాజిటర్ల ప్రయోజనాలు ప్రమోషన్ తదితరాల కోసం వినియోగిస్తారు.
* బీమా రంగానికి చెందిన కంపెనీలు కూడా తమవద్ద ఉన్న సొమ్మును ఇలాగే బదిలీ చేయాల్సిఉంటుంది.
* కేంద్రం ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ ఫండ్ (ఎస్ సిడబ్ల్యుఎఫ్) కు బీమా కంపెనీలు పదేళ్లు మించిన అన్ క్లెయిమ్డ్ సొమ్మును బదిలీ చేయాల్సి ఉంటుంది.
* ఈ సొమ్మును సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం వినియోగిస్తారు.

క్లెయిమ్ చేసుకోవడం ఎలాగంటే?
* భారత రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా పదేళ్ల పాటు ఉన్న ఖాతాలను బ్యాంకులు అన్ క్లెయిమ్డ్ ఖాతాలుగా పరిగణించాలి.
* ఈ ఖాతాల వివరాల జాబితాను బ్యాంక్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాలి.
* ఖాతా తీసుకున్నవారు మరణించిన సందర్భంలో ఆ ఖాతా గురించి కుటుంబ సభ్యులకు తెలియక పోవచ్చు. దీనివల్ల ఆ ఖాతాల్లో లావాదేవీలు నిలిచిపోతాయి.
* ఈ ఖాతాలోని సొమ్మును కుటుంబ సభ్యులు లేదా వారసులు క్లెయిమ్ చేసినప్పుడు బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన సొమ్మును బ్యాంకులు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు.
* అన్ క్లెయిమ్డ్ ఖాతాలను బ్యాంకు వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకు పేరు, పుట్టిన తేదీ లేదా పేరు, పాన్ లేదా పేరు, పాస్ పోర్ట్ నెంబర్ లేదా పేరు, పిన్ కోడ్ లేదా పేరు ఫోన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications