ప్రముఖ వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను లాంచ్ చేసింది. దీని పేరు అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ. ఇది గ్రీన్ రంగులో అందుబాటులో ఉండనుంది. కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ బైక్‌కు పెట్రోల్ అవసరం లేకుండా పెట్రోల్ బదులు ఇథనాల్‌తో ట్యాంక్‌ను ఫుల్ చేయించుకోవాలి. బైక్ ధర ఆర్‌టీఆర్ 200 ఎఫ్ఐతో పోలిస్తే దాదాపు 11,000 ఎక్కువ. అంటే బైక్ కొనుగోలు చేయాలంటే రూ.1.2 లక్షలు కావాలి. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఆన్‌రోడ్ ధర మరో రూ.20 వేలు వరకు పెరగొచ్చు. ఈ బైక్స్ తొలిగా మహరాష్ట్ర, యూపీ, కర్నాటక రాష్ట్రాల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో 200 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. బైక్ టాప్ స్పీడ్ గంటకు 129 కిలోమీటర్లు.
టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసస్ ఈ బైక్‌ను న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మార్కెట్‌లో ఆవిష్కరించారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు బైక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీవీఎస్ మోటార్ ఇథనాల్ బైక్‌ను లాంచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసిందని, దేశంలో ఇథనాల్‌తో నడిచే తొలి బైక్ ఇదేనని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడారు . పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. పర్యావరణానికి రక్షణ కలిగిస్తుంది.

ఇథనాల్ ఇంధనానికి మారటం చాలా సులువని చెప్తున్నా ప్రస్తుతం ఈ ఇంధనం అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో లేదు .ఇది పర్యావరణంపై ఎంత మాత్రం ప్రభావం చూపించదని అంతేకాకుండా వినియోగదారునిపై కూడా వ్యయ భారం ఉండదని ఇథనాల్ ఇంధనం గురించి శ్రీనివాసన్ పేర్కొన్నారు. దేశీయంగా పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు . నాన్ టాక్సిక్, బయోడీగ్రేడబుల్ ఇంధనంకావటంతో సులభంగా రవాణా, నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఇక పర్యావరణాన్ని ప్రస్తుత కాలుష్యం నుండి రక్షించటానికి దేశంలో ఇథనాల్ పంపులు కావాలని చెప్పారు. ఎక్కడా కూడా ఇథనాల్ ఇంధనాన్ని విక్రయించే పంపులు లేవని, దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర పెట్రోలియం శాఖను కోరనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications