స్థిరాస్తులు కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా ? ఎలాంటి ఆస్తులు కొనుగోలు చెయ్యాలి? వాటికి ఏమేమి ఉండాలి? ముఖ్యంగా ప్లాట్స్ , ఫ్లాట్స్ కొనుగోలు చేసేటప్పుడు ఏమేమి చూసుకోవాలి? అంటే అన్నీ పక్కా గా ఉన్నా రెరా రిజిస్ట్రేషన్ ఉన్న స్థిరాస్తులు చూసుకోవాలి . ఎందుకంటె అది కొనుగోలుదారులకు భద్రత కల్పిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో 'రెరా' చట్టం అమలులోకి వచ్చి రెండేళ్ళు అయినా ఇప్పటికి కూడా అనేక స్థిరాస్తి వెంచర్లు ఈ చట్టం కింద నమోదు కాలేదు. చాలా మంది వ్యాపారులు రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండానే ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇలాంటి వెంచర్లలో స్థిరాస్తులు కొంటే చాలా నష్టాలున్నాయి. అపార్ట్‌మెంట్, ఇంటి స్థలం, దుకాణం.. ఇలా ఎలాంటి స్థిరాస్తిని కొనుగోలు చేయాలన్నా అవి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ దగ్గర నమోదయ్యాయో లేదో తెలుసుకోవాలి. లేకుంటే వాటి కొనుగోలు చెయ్యటం రిస్క్ తో కూడుకున్న పని.

స్థిరాస్తి కొనుగోలు రంగంలో చోటు చేసుకునే మోసాలకు చెక్ పెట్టేందుకే 'రెరా'
స్థిరాస్తి కొనుగోలు రంగంలో చోటు చేసుకునే మోసాలు, అవకతవకలకు చెక్ పెట్టేందుకు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రెరా చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఏపీ, తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలు ఆ చట్టం ప్రాతిపదికపై తమ సొంత రెరా చట్టాలు అమల్లోకి తెచ్చాయి. ఈ చట్టంతో బిల్డర్ల ఆగడాలకు చెక్ పెట్టే అవకాశం ఏర్పడింది.అలాగే కొనుగోలు దారులకు భద్రత కల్పించబడింది. 'రెరా'చట్టం వల్ల అందులో నమోదు చేసుకుంటే ప్రతి స్థిరాస్తి వ్యవహారం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది . కొనుగోలుదారులు చెల్లించే నగదును, రియల్టర్లు తమకు నచ్చినట్టు వాడుకోవడం లేదా వేరే ప్రాజెక్టులకు మళ్లించేందుకు అవకాశం ఉండదు. ఆధిక పరమైన చేల్లిపులే కాదు స్థలాలకు సంబంధించిన, భవనాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఉంటాయి. కాబట్టి మోసం చేసే చాన్స్ ఉండదు.

కొనుగోలుదారులకు , రియల్టర్లకు ‘రెరా' చట్టం భద్రత
బిల్డర్లు ఆయా ప్రాజెక్టులను నిర్దిష్ట కాలవ్యవధి లోగా నిర్ణీత ప్రమాణాలతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ప్లాట్లు లేదా ఫ్లాట్లు కొనుగోలుదారులకు జాప్యం లేకుండా సక్రమంగా అందుతాయి. ప్రతి రియల్టీ ప్రాజెక్టును ముందుగానే అన్ని వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కాబట్టి అన్ని వివరాలు పూర్తిగా పరిశీలించాకే 'రెరా' అనుమతిని ఇస్తుంది.
రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, భవనాలు ఇత్యాది ఎటువంటి స్థిరాస్తుల అమ్మకాలు చేయకూడదు. అంతే కాదు ప్రచారం సైతం చెయ్యరాదు . ఈ నిబంధనలు ఉల్లంఘించే స్థిరాస్తి సంస్థలు లేదా వ్యక్తులపై భారీ జరిమానా కూడా విధిస్తారు. నిబంధనలకు లోబడి, సజావుగా తమ కార్యకలాపాలను నిర్వర్తించే రియల్టర్లకు ‘రెరా' చట్టం రక్షణ కల్పిస్తుంది. రెరా వద్ద నమోదైన ప్రాజెక్టుల్లో ప్రమోటర్లు, బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏమైనా అంశాల్లో విభేదాలు తలెత్తితే, వాటిని సామరస్యంగా పరిష్కరించేందుకూ రెరా కృషి చేస్తుంది. కనుక 'రెరా' రిజిస్ట్రేషన్ ఉన్న వాటినే కొనుగోలు చెయ్యటం ఎంతో శ్రేయస్కరం అని ప్రభుత్వాలు చెప్తున్నాయి.

ఏపీలో రెరా చట్టం అమలు నామమాత్రం .. రాజధాని ప్రాంతంలో కొనుగోలుదారులు జర భద్రం
రెరా చట్టం పకడ్బందీగానే ఉన్నా ఇప్పటికీ స్థిరాస్తుల కొనుగోలుదార్లలో చాలా మందికి ఈ చట్టంపై సరైన అవగాహన లేక ఏదో నామమాత్రంగానే 'రెరా' లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న పరిస్థితి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత దాని చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లెక్కకు మిక్కిలిగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. ‘క్యాపిటల్ క్రేజ్'ను సొమ్ము చేసుకునే తాపత్రయంలో పలువురు రియల్టర్లు ఇళ్ల స్థలాల వెంచర్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని చేపట్టారు. గత రెండేళ్లలో ఇలాంటి వెంచర్ల సంఖ్య మరింత పెరిగింది. వీటిల్లో చాలావాటికి ఏపీసీఆర్డీయే అనుమతులున్నప్పటికీ, ‘రెరా' రిజిస్ట్రేషన్ నెంబర్లు లేవు. అయినప్పటికీ ఈ విషయం పెద్దగా పట్టించుకోకుండా, చాలామంది అలాంటి వెంచర్లలో కొనుగోళ్లు జరిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లోనూ, ఉంది .అంతా సజావుగా సాగితే ఫర్లేదు అనుకోని పరిణామాలు లేదా రియల్టర్ల లాభాపేక్ష, స్వార్ధంతో ఏమైనా ప్రాజెక్టులు అర్ధంతరంగా, అసంపూర్ణంగా ఆగిపోతే వాటిల్లో కొనుగోళ్లు జరిపిన వారు నష్టపోవడం తథ్యం.అలా నష్టపోకుండా ఉండాలంటే 'రెరా' లో నమోదై ఉంటేనే కొనుగోలు చెయ్యండి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications