ప్రపంచ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌గా భారతీయురాలు, ప్రస్తుతం ఎస్బీఐ ఎండి అన్షులా కాంత్‌ను నియమిస్తునట్టు వాల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ ప్రకటించారు. కొత్తగా ప్రపంచ బ్యాంకులో బాధ్యతలు చేపట్టబోతున్న ఆమె ఆర్థిక, రిస్క్ నిర్వాహణను చూడబోతున్నారు.
''అన్షులా కాంత్‌ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎండీ, సీఎఫ్ఐగా నియమించడం సంతోషంగా ఉంది. అమెకు ఫైనాన్స్, బ్యాంకింగ్ సహా బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని వినూత్నంగా ఎలా వినియోగించాలో చక్కటి అనుభవం ఉంది. ఎస్బీఐలో సీఎఫ్ఓగా ఇంతకాలం పనిచేసిన ఆమె, తన విధులను విజయవంతంగా కొననసాగించారు'' - డేవిడ్ మల్పాస్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు.

అన్షులాకు ఉన్న అనుభవం నేపధ్యంలో ఆమెకు సాధారణ నిర్వాహణ వ్యవహారాలతో పాటు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ బాధ్యతలను అప్పగించబోతున్నారు. వీటికి తోడు బ్యాంక్ సీఈఓతో కలిసి ఇతర ఆర్థిక వనరులపై కూడా దృష్టి పెట్టబోతున్నారు.
ప్రస్తుతం ఎస్బీఐ ఎం.డి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె సుమారు 38 బిలియన్ డాలర్ల (రూ.2.3
లక్షల కోట్లు) ఆదాయాన్ని, 500 బిలియన్ డాలర్ల (రూ.35 లక్షల కోట్లు) ఆస్తులను నిర్వహిస్తున్నారు. ఎస్బీఐలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న ఆమె క్యాపిటల్ బేస్‌ను గణనీయంగా పెంచారు. గతేడాదే కాంత్ బ్యాంక్ బోర్డులోకి వచ్చి ఎండీగా నియమితులయ్యారు.
అన్షులా కాంత్ లేడీ శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్ నుంచి ఎకనమిక్స్ హానర్స్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిస్ట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1960లో జన్మించిన ఆమె 1983లో ఎస్బీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. అప్పటి నుంచి వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె సింగపూర్‌లో ఉన్నప్పుడు అక్కడ రిటైల్ సేవలను ప్రారంభించారు. ఓ ఇండియన్ బ్యాంక్ సింగపూర్‌లో రిటైల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించడం అదే మొదలు.


Click it and Unblock the Notifications