లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అందిస్తోన్న ప్లాన్స్‌లో మనీ బ్యాక్ ప్లాన్ ఒకటి. మనీ బ్యాక్ పాలసీ ఓ తేలికపాటి ఇన్సురెన్స్ పాలసీ. పాలసీదారు ఎలాంటి విపత్తు నుంచి ఐనా కుటుంబానికి రక్షణ కల్పిస్తూనే నిర్దిష్ట కాలపరిమితిలో కొంత శాతం వంతున సొమ్ము అందుకుంటారు. మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇందులో ఒకటి. ఇది నాన్ లింక్డ్ ప్లాన్. ఆర్థిక భద్రత, రక్షణ ఈ పాలసీ ప్రత్యేకత. ఇన్సురెన్స్ ప్లాన్స్, ఎండోమెంట్ ఇన్సురెన్స్ పాలసీలు, పెన్షన్ ప్లాన్స్ తదితర స్కీంలను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది.

ఇదీ మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్ పాలసీ
13 ఏళ్ల నుంచి 50 ఏళ్ల ఇండివిడ్యువల్స్ ఎల్ఐసీ మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. కనీసంగా రూ.లక్ష పాలసీ తీసుకోవాలి. ఈ పాలసీ తీసుకోవడానికి గరిష్ట పరిమితి లేదు. ఎల్ఐసీ మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్ ప్లాన్ గరిష్ట మెచ్యూరిటీ పీరియడ్ 70 ఏళ్లు. ఈ పాలసీ కాలం 20 ఏళ్లు కాగా, 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి.

బోనస్
ఎల్ఐసీ మనీ బ్యాక్ ప్లాన్ 20 ఇయర్స్ ప్లాన్ తీసుకున్న పాలసీదారులు అయిదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లకు ఒకసారి బేసిక్ సమ్ అష్యూర్డ్ మొత్తంలో 20 శాతం తిరిగి చెల్లిస్తుంది. ఎల్ఐసీ మనీ బ్యాక్ ప్లాన్‌లో 20వ ఏడు ముగింపు సమయానికి సబ్‌స్క్రైబర్‌కు బేసిక్ హామీ మొత్తంలో 40 శాతం చెల్లిస్తారు. సాధారణ బోనస్, ఫైనల్ అడిషనల్ బోనస్‌లు కూడా ఉంటాయి.

ప్రీమియం ఇలా..
పాలసీదారు మరణిస్తే వార్షిక వార్షిక ప్రీమియంకు 10 రెట్లు లేదా బేసిక్ హామీ మొత్తంలో 125 శాతం మొత్తాన్ని పాలసీదారు కుటుంబానికి అందిస్తారు. పాలసీ ప్రీమియం... 20 ఏళ్లలో పాలసీతీసుుకుంటే ఏడాదికి రూ.1,000 మత్తానికి దాదాపు రూ.78 చెల్లించాలి. అదే 30 ఏళ్లలో పాలసీ తీసుకుంటే రూ.79.10 చెల్లించాలి. 40 ఏళ్లలో తీసుకుంటే రూ.82.95 చెల్లించాలి. 50 ఏళ్లలో తీసుకుంటే రూ.92.05 చెల్లించాలి. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లింపుల్లో ఒకవేళ విఫలమైనా నెల రోజుల గ్రేస్ పీరియడ్ ఉంది. నెల రోజుల వరకు పెనాల్టీ లేదు. పాలసీ మొత్తం పెరిగితే ప్రీమియం పెరుగుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications