ట్రంప్ ఇన్నేళ్లకు ఒక్క గుడ్ న్యూస్ చెప్పాడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. భారతీయులకు ఇన్నేళ్లకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. గ్రీన్ కార్డుల జారీపై ఇంతకాలం ప్రతీ దేశానికి ఉన్న పరిమితిని ఎత్తేయబోతున్నారు. ఇది ప్రత్యక్షంగా భారతీయ ఐటీ కంపెనీ ఉద్యోగులు ఎంతగానో ఉపయోగపడోబోతోంది. ఎప్పటి నుంచో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్స్.. ఇక గ్రీన్ కార్డ్ పొంది అక్కడే ఉండిపోవచ్చు.

గ్రీన్ కార్డ్ రావొచ్చు
గ్రీన్ కార్డ్ అంటే.. ఇతర దేశస్థులు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడేందుకు ఇచ్చే అనుమతి. అలాంటి అనుమతి అంత ఈజీగా దొరకదు. కొంత మంది దశాబ్దాల తరబడి అక్కడ పనిచేస్తున్నా ఇప్పటికీ గ్రీన్ కార్డ్ దొరకని స్థితి. ఎక్కువగా ఇండియన్స్, చైనీయులు ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. నిపుణులైన పనిమంతులను తమ దేశంలో నివాసం ఉండేందుకు అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసాలు, గ్రీన్ కార్డులను ఇస్తుంది. గ్రీన్ కార్డ్ వస్తే.. అక్కడ దాదాపుగా పౌరసత్వం లభించినట్టే లెక్క. ఎందుకంటే ఎలాంటి ఆంక్షలూ లేకుండా అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ నివాసం ఉండొచ్చు.
అయితే ప్రతీ ఏటా వాళ్లు కేటాయించే గ్రీన్ కార్డుల్లో ప్రతీ దేశానికీ గరిష్టంగా ఏడు శాతం పరిమితి ఉంటుంది. అంటే వంద గ్రీన్ కార్డ్స్ ఇస్తే.. ఒక దేశానికి చెందిన వాళ్లకు 7కు మించి ఇవ్వడానికి వీల్లేదు. అయితే ఈ నిబంధనను సడలిస్తూ చేసిన బిల్లుకు హౌస ఆఫ్ రెప్రెంజేటిటివ్స్ ఆమోద ముద్ర వేసింది. దీని వల్ల భారత్ సహా వివిధ దేశాల వాళ్లు శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు లైన్ క్లియర్ అయింది.

భారతీయులకే బెనిఫిట్
ఎక్కువగా భారతీయులే అమెరికాలో కుటుంబంతో సహా స్థిరపడిపోవాలని తహతహలాడుతూ ఉంటారు. వాళ్లు ఇచ్చే గ్రీన్ కార్డ్ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూస్తూ ఉండిపోతారు. పిల్లలకు అక్కడి పౌరసత్వం లభిస్తే ఇక చాలనుకునేవాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. అయితే హెచ్ 1 బి వీసాలపై వెళ్లిన వాళ్లకు ఇప్పుడున్న క్యూ పద్ధతిలో గ్రీన్ కార్డ్ లభించాలంటే సుమారు 70 ఏళ్లు నిరీక్షించాల్సిన స్థితి. ప్రతీ దేశానికీ ఇంత మంది మాత్రమే అని ఉండే గరిష్ట పరిమితి కారణంగా అమెరికా కూడా అధిక సంఖ్యలో గ్రీన్ కార్డ్స్ ఇవ్వడం కుదరదు. వాళ్ల దేశానికి ప్రయోజనకారిగా ఉంటారు, పనికొస్తారు.. అనుకుంటేనే ఏ దేశమైనా తమ దేశంలో శాశ్వతంగా స్థిరనివాసం ఏర్పర్చుకునేందుకు వీలు కల్పిస్తారు.

సెనెట్‌లో నెగ్గాలి
మొదటి అవాంతరం దాటిన ఈ బిల్లు ఇప్పుడు సెనేట్ కూడా నెగ్గాల్సి ఉంటుంది. ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారుతుంది.
మొత్తానికి ఇప్పటికైనా గ్రీన్ కార్డ్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న అమెరికన్ సెటిల్డ్ ఇండియన్స్‌కు ఇది చిన్నపాటి ఊరట.


Click it and Unblock the Notifications