For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక హైదరాబాద్‌లో అత్యాధునిక రాఫెల్ మిసైల్ కిట్స్ తయారు

By Chanakya
|

భారత వాయుసేనకు, ఆర్మీకి అవసరమైన అత్యాధునిక మిసైల్ కిట్స్ ఇక హైదరాబాద్‌లోనే తయారు కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి రాఫెల్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 4 ఏళ్లలో 1000 అత్యాధునిక బరాక్-8 ఎంఆర్ఎస్ఏఎం మిసైల్ కిట్స్‌ను (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్) భారత్ డైనమిక్స్‌కు సరఫరా చేయాల్సి ఉంది. ఈ కొత్త మిసైల్స్ నేపధ్యంలో మన డిఫెన్స్ వ్యవస్థ మరింత పటిష్టం కాబోతోంది.

అతిపెద్ద డీల్
భారత దేశ డిఫెన్స్ ఎఫ్.డి.ఐ.లో ఇది అతిపెద్ద డీల్‌గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది సుమారు 100 మిలియన్ డాలర్ల ఆర్డర్. మన దేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.700 కోట్ల వరకూ ఉంటుంది. రాఫెల్, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమర్స్ సంయుక్తంగా కళ్యాణి రఫేల్ అడ్వాన్స్ సిస్టమ్స్ పేరుతో ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ కొత్త సంస్థలో 49 : 51 శాతం వాటాలు ఉండబోతున్నాయి. మేకిన్ ఇండియా, మేక్ విత్ ఇండియా అనే నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు రఫేల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ జనరల్ పిని యుంగ్మాన్ తెలిపారు. కేవలం తయారీ ఒక్కటే కాకుండా వాటి నిర్వాహణ, మరమ్మత్తుల కోసం కూడా అత్యాధునిక ఎం.ఆర్.ఓ. కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా 2023 నాటికి ఈ కొత్త సంస్థలో 300 మంది ఉద్యోగులను తీసుకోబోతున్నట్టు కళ్యాణి సంస్థ ఛైర్మన్ బాబా కళ్యాణి తెలిపారు.

KRAS secures USD 100 million order for Barak 8 missile kits

హైదరాబాద్‌లో విస్తరణ
ఇప్పటికే మహేశ్వరంలోని ఆదిభట్లలో ప్లాంట్ కలిగిన కళ్యాణి రాఫెల్ ఇండియా దీన్ని మరింతగా విస్తరించాలని చూస్తోంది. కొత్తగా వచ్చిన 1000 మిసైల్ కిట్ల తయారీతో పాటు మరిన్ని ప్రాజెక్టుల కోసం సుమారు 100 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు బాబా కళ్యాణి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం అందిందని, ఇలాంటి బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్‌ను తాను ఇప్పటి వరకూ చూడలేదని బాబా కళ్యాణి తెలిపారు.

ఇండిగో ప్రమోటర్ చేతికి బర్గర్ కింగ్?ఇండిగో ప్రమోటర్ చేతికి బర్గర్ కింగ్?

ఇప్పటికే హైదరాబాద్ ప్లాంట్ నుంచి సుమారు 15 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతులు చేశామని, రాబోయే రోజుల్లో వీటిని 20 నుంచి 30 మిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు వివరించారు. అయితే గోప్యతను దృష్టిలో ఉంచుకుని రక్షణ భాగాల నేపధ్యంలో మరిన్ని వివరాలను వెల్లడించలేనన్నారు. ఈ మధ్యకాలంలో సర్జికల్ స్టైక్స్‌తో బాగా పాపులర్ అయిన ఓ కీలక ఉపకరణం హైదరాబాద్ ప్లాంట్‌లోనే తయారైన విషయాన్ని కూడా చూచాయిగా చెప్పారు ప్రతినిధులు.

English summary

ఇక హైదరాబాద్‌లో అత్యాధునిక రాఫెల్ మిసైల్ కిట్స్ తయారు | KRAS secures USD 100 million order for Barak 8 missile kits

Kras receives 100 mn$ order from rafael. contract to supply 1000 Barak-8 mrsam missiles kits for the Indian army and Air force. Hyderabad based Kalyani Rafeal advanced systems in manufacturing these missiles.
Story first published: Thursday, July 11, 2019, 17:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X