For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కరోజులో భారీ షాక్: రూ.930 పెరిగిన బంగారం ధర

|

న్యూఢిల్లీ: బంగారం ధరలు గురువారం భారీగా పెరిగాయి. గత శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సోమవారం బంగారం ధర రూ.600 వరకు పెరిగింది. ఆ తర్వాత కాస్త తగ్గినా, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.930 పెరిగి, రూ.35,800గా ఉంది.

త్వరలో వడ్డీ రేట్లు తగ్గవచ్చునని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులు సురక్షితమని ఇన్వెస్టర్లు భావించారు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో మన వద్ద బంగారం భారీగా పెరిగింది.

Gold prices zoom Rs.930 to Rs.35,800 per 10 gram

అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1,420.80 డాలర్లు, ఔన్స్ వెండి ధర 15.24 డాలర్లుగా ఉంది. మరోవైపు, పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెండి ధర కూడా రూ.300 పెరిగి, రూ.39,200గా ఉంది.

జూలై1 నుంచే మార్పు.. రైల్వే టైంటేబుల్, RTGS-NEFT ఛార్జీలుజూలై1 నుంచే మార్పు.. రైల్వే టైంటేబుల్, RTGS-NEFT ఛార్జీలు

ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ ప్రకారం 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.930 పెరిగి రూ.35,800, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.35,630గా ఉంది. 8 గ్రాముల సావరిన్ గోల్డ్ రూ.100 పెరిగి, రూ.27,400కి చేరుకుంది.

English summary

ఒక్కరోజులో భారీ షాక్: రూ.930 పెరిగిన బంగారం ధర | Gold prices zoom Rs.930 to Rs.35,800 per 10 gram

Gold prices Thursday zoomed Rs 930 to Rs 35,800 per 10 gram in the national capital tracking positive overseas trend after US Federal Reserve Chairman Jerome Powell hinted at a rate cut soon that prompted investors to move towards safe-haven assets like the yellow metal.
Story first published: Thursday, July 11, 2019, 18:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X