అల్పాదాయ వర్గాలను ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములను చేసేందుకు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో అయిదేళ్ల క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం జన్ ధన్ యోజనను ప్రారంభించింది. ఈ ఖాతాల్లో డిపాజిట్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. జూలై 3వ తేదీ నాటికి జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన అకౌంట్స్‌లలో జమ అయిన డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉంది.
జూన్ ఆరో తేదీ నాటికి ఆ డిపాజిట్ల పరిమాణం రూ.99,649.84 కోట్లుగా ఉంది. అంతకుముందు వారం రూ.99,232.71 కోట్లుగా ఉంది. అయిదేళ్లుగా నిధులు నిలకడగా పెరుగుతున్నాయి. జూలై 3 నాటికి దేశవ్యాప్తంగా 36.06 కోట్ల ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్ట్ 28వ తేదీన ప్రారంభించింది. ఈ అకౌంట్ తెరిచిన వారికి రూపే డెబిట్ కార్డ్ సదుపాయంతో కూడిన బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు తెరుచుకునే వీలు కల్పించారు.

జీరో బ్యాలెన్స్‌తో తెరిచే ఈ ఖాతాల్లో రూ.10,000 ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని కింద ఇప్పటి వరకు 28 కోట్ల మందికి పైగా ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డులు మంజూరు చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. PMJDY కింద ఉన్న అకౌంట్స్ 2018 మార్చిలో5.10 కోట్ల నుంచి 2019 మార్చి నాటికి 5.07 కోట్లకు తగ్గాయి.
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) కింద మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదు. ఆగస్ట్ 28, 2018 తర్వాత కొత్త అకౌంట్ హోల్డర్స్‌కు యాక్సిడెంట్ ఇన్సురెన్స్ రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 50 శాతం మంది జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ మహిళలు. జన్ ధన్ యోజన కారణంగా ఎంతోమంది బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్నారు.


Click it and Unblock the Notifications