పది రోజుల క్రితం వరకు కొండెక్కిన చికెన్ ధరలు ఇప్పుడు దిగి వచ్చాయి. రికార్డు స్థాయిలో కిలో చికెన్ ధర రూ 250 నుంచి రూ 270 వరకు వెళ్ళింది. ఈ ధరలతో బెంబేలెత్తి పోయిన జనాలు ... చికెన్ కొనుగోలుకు జంకారు. ఎండలు ముదిరిన మార్చ్ నెలాఖరు, ఏప్రిల్ నుంచి చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఎండలు తీవ్రంగా ఉన్న మే, జూన్ నెలల్లో ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. అయితే, సహజంగానే ఎండా కాలంలో వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి చాల కోళ్లు చనిపోతూ ఉంటాయి. తద్వారా మార్కెట్లోకి చికెన్ సరఫరా తగ్గిపోతుంది. రమారమి ప్రతి వంద కోళ్లలో 15-20 వరకు ఎండా కాలంలో మరణిస్తాయి.

ప్రస్తుతం అందుబాటులోకి
ఇప్పుడు మార్కెట్లో చికెన్ ధర రికార్డు స్థాయి నుంచి దాదాపు రూ వంద వరకు తగ్గి రూ 177 (స్కిన్ లెస్ చికెన్) అభిస్తుండగా... స్కిన్ తో చికెన్ కిలో రూ రూ 155 పలుకుతోంది. ఈ ధరలు దేశంలోనే అతిపెద్దది ఐన పౌల్ట్రీ కంపెనీ వెంకాబ్ ప్రకటించిన నేటి (10/07/2019) ధరలు. దీంతో వినియోగదారులు కొంత ఊపిరి పీల్చుకొంటున్నారు. కూరగాయల ధరలు అమాంతం పెరిగిన ఈ సమయంలో చికెన్ ధరలు తగ్గటం కొంత ఊరటేనని చెప్పాలి. ప్రస్తుతం కూరయల మార్కెట్లో కిలో బీన్స్ ధర రికార్డు స్థాయిలో రూ 120 పలుకుతోంది. దీంతో పోల్చితే కిలో చికెన్ అందుబాటు ధరలోకి దిగి వచినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ టాప్...
చికెన్ వినియోగం లో దేశంలోనే హైదరాబాద్ మహా నగరం తొలి స్థానంలో నిలుస్తోంది. బిర్యానీకి ఫేమస్ ఐన మన సిటీ లోసగటున రోజుకు సుమారు 25 లక్షల కిలోల చికెన్ ఆరగిస్తున్నారు. సెలవు దినాలు, ఆది వారాల్లో ఈ వినియోగం మరింత అధికంగా ఉంటుంది. హైదరాబాద్ నగర అవసరాలు తీర్చేందుకు రోజుకు సుమారు 30-35 లక్షల కోళ్లు అవుతాయని పౌల్ట్రీ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రోజుకు దాదాపు 80 లక్షల కిలోల నుంచి కోటి కిలోల వరకు ఉంటుందని అంచనా.

ఉత్పత్తి లోనూ మననే నెంబర్ వన్ ...
వినియోగం లోనే కాదు... పౌల్టీ ఉత్పత్తి లోనూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే తోలి స్థానం లో ఉంటాయి. దేశంలో జరిగే మొత్తం పౌల్ట్రీ ఉత్పత్తుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మూడో వంతుకు పైగా ఉత్పత్తి జరుగుతుందంటే ఈ రంగంలో మన శక్తి ఏమిటో తెలుస్తుంది. కోడి గుడ్లు రంగం లేయర్, కోడి మాంసం అందించే బ్రాయిలర్ లోనూ మనది నెంబర్ వన్ ర్యాంకు.

వర్షాకాలం లో ధరలు...
వర్షాకాలం లో ఉష్ణోగ్రతలు తగ్గటం వాళ్ళ కోళ్ల మరణాల రేటు తగ్గి పోయింది. దాంతో మార్కెట్లోకి కోళ్ల సరఫరా మెరుగైంది. వచ్చే రెండు నెలల్లో ధరల్లో పెద్ద మార్పులు ఉండక పోవచ్చున్నాని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట కిలో చికెన్ ధరలు రూ 150 నుంచి రూ 175 మధ్యలో ఉండొచ్చని తెలిపారు. సో, అందుబాటులోకొచ్చిన ధరలతో చికెన్ వినియోగం మళ్ళీ భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications