కొత్త ఫండ్ ఆఫర్లు ఇవే... వివిధ మ్యుచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికోసం మరికొన్ని ఫండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫండ్స్ ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు.

బరోడా మ్యూచువల్ ఫండ్
* బరోడా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ పేరుతో ఈ కొత్త స్కీం ను ప్రారంభించారు.
* ఆర్బిట్రేజ్ అవకాశాలతో పాటు ఈక్విటీ/ఈక్విటీ సంభందిత సాధనాలు, డేట్/మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మూలధనాన్ని పెంచడంతో పాటు ఆదాయాన్ని వృద్ధి పరచాలన్నది ఈ స్కీం ప్రధానమైన ఉద్దేశం. అయితే ఈ పథక పెట్టుబడి ఉద్దేశం నెరవేరడంపై ఎలాంటి హామీ లేదా గ్యారంటీ ఉండదు.
* ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. హైబ్రిడ్ - ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీలో దీన్ని తెచ్చారు.
* జూలై 4న ప్రారంభమైన ఈ పథకం 16వ తేదీన ముగుస్తుంది.
* ఇందులో కనీస పెట్టుబడి రూ. 5,000
* పూర్తి సమాచారం www.barodamf.com ద్వారా తెలుసుకోవచ్చు.

ఇండియా బుల్స్ మ్యూచువల్ ఫండ్
* ఇండియా బుల్స్ ఎఫ్ ఎమ్ పీ సిరీస్ VI- Plan 2- 1135 Days పేరుతో ఈ స్కీం ను అందుబాటులోకి తెచ్చారు.
* డేట్, మనీ మార్కెట్ సెక్యూరిటీ పోర్టుఫోలియో లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిటర్న్ లను, మూలధనాన్ని పెంచడం ఈ స్కీం ప్రధాన లక్ష్యం.
* ఆదాయం కేటగిరీలో వచ్చిన క్లోజ్ ఎండెడ్ స్కీం ఇది.
* జూన్ 28న ప్రారంభమైన ఈ పథకం జూలై 12న ముగియనుంది.
* పూర్తి సమాచారం కోసం www.indiabullsamc.com ను సందర్శించవచ్చు.

మహీంద్రా మ్యూచువల్ ఫండ్
* మహీంద్రా హైబ్రిడ్ ఈక్విటీ నివేశ్ యోజన పేరుతో ఈ స్కీం ప్రారంభించారు.
* ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాలు డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్ల సంపదను పెంచాలన్నది ఈ స్కీం ఉద్దేశం.
* హైబ్రిడ్ స్కీం - అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
* జూన్ 28న ప్రారంభమైన ఈ పథకం జూలై 12న ముగియనుంది.
* ఎంట్రీ లోడ్ లేదు.
* కేటాయించిన యూనిట్లలో 10 శాతం యూనిట్లను 12 నెలలలోపు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా రెడీమ్ చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ఇక శాతం ఎగ్జిట్ లోడ్ చార్జీ చెల్లించాలి. 12 నెలలు దాటినా తర్వాత అయితే ఎగ్జిట్ లోడ్ ఉండదు.
* ఈ స్కీం లో కనీస పెట్టుబడి రూ. 1,000
* మరింత సమాచారం కోసం www.mahindramutualfund.com ను సందర్శించవచ్చు.

మిరాయి అసెట్ మ్యూచువల్ ఫండ్
* మిరాయి అసెట్ మిడ్ క్యాప్ ఫండ్ పేరుతో దీన్ని ప్రారంభించారు.
* మిడ్ క్యాప్ కంపెనీలకు చెందిన ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టనున్నారు.
* ఈక్విటీ స్కీం - మిడ్ క్యాప్ ఫండ్ కేటగిరీ లో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
*జూలై 8న ఇది ప్రారంభం అయింది. జూలై 22న ముగుస్తుంది.
* www.miraeassetmf.co.in ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications