బైక్స్, స్కూటర్ల ధరలు పెంచిన హీరో మోటోకార్ప్
ఇండియా లార్జెస్ట్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటో కార్ప్.. మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ధరలను పెంచింది. ఈ మేరకు సోమవారం నాడు వెల్లడించింది. ద్విచక్ర వాహనాలపై 1 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఈ రోజు (జూలై 9) నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.
ద్విచక్రవాహన శ్రేణిలోని అన్ని బైక్స్ పైన ధరను ఒక శాతం పెంచుతున్నాం. మోడల్, ప్రత్యేకతల ప్రకారం ఈ ధరల్లో మార్పు ఉండవచ్చున'ని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ధరలు ఎందుకు పెంచుతున్నారో వెల్లడించలేదు.

ఈ కంపెనీ నుంచి గేర్‌లెస్ స్కూటర్స్ నుంచి స్పోర్ట్స్ వరకు వివిధ రకాల స్కూటర్స్, బైక్స్ ఉన్నాయి. కాగా, హీరో మోటో కార్ప్ షేర్లు సోమవారం నాడు రూ.2,380.20 వద్ద క్లోజ్ అయింది. రూ.133.40 పాయింట్లు లేదా 5.31 శాతం నష్టపోయింది. ఓ సమయంలో నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.
దేశంలో కార్లు, టూవీరల్స్ సహా ఆటో సెక్టార్ ఇబ్బందిక పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు ఆటో సంస్థలు తమ ఉత్పత్తులను తగ్గించిన విషయం తెలిసిందే.
ఆర్థిక రంగం అంతంతగా ఉండటం, మరోవైపు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటంతో ఆటో అమ్మకాలు తగ్గాయి. మారుతి సుజుకీ, పాటు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్ వంటి కంపెనీలు కూడా డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తిని తగ్గించాయి. మే నెలలో మొత్తం ప్యాసింజర్ వాహన అమ్మకాలు పద్దెనిమిదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. సెప్టెంబర్ 2001 తర్వాత వాహన విక్రయాలో ఇంత తగ్గడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా, మార్కెట్లో మారుతి సుజుకీ షేర్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications