ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్ డ్యూటీ 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం నాడు బంగారం ధర భారీగా పెరిగింది. అయితే మంగళవారం నాటికి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (జూలై 9) పసిడి దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో ధర తగ్గింది.
పది గ్రాముల బంగారం ధర ఈ రోజు 600 తగ్గి రూ.34,870గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.48 తగ్గి 38,900గా ఉంది. గ్లోబల్‌గా ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1,394.39 డాలర్ల కనిష్టానికి పడిపోయింది. అలాగే, ఔన్స్ వెండి ధర న్యూయార్క్ మార్కెట్లో 15.08 డాలర్లుగా ఉంది.

బంగారం గత వారాంతంలో రూ.35వేల మార్క్ దాటి రూ.35,470కి చేరింది. అయితే సుంకం పెంపు ధరలపై ప్రభావం చూపుతోందని, దీని వల్ల దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా నేడు బంగారం ధర దిగొచ్చింది.
ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర సోమవారం నాటి రూ.35, 470తో పోలిస్తే రూ.600 తగ్గి రూ.34,870కి చేరుకుంది. ఫ్యూచర్స్ మార్కెట్లోనూ 10 గ్రాముల బంగారం ధర రూ.98 క్షీణించి 34,381 వద్ద ఉంది. సావరిన్ గోల్డ్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications