ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తన తోలి బడ్జెట్ లో భాగంగా భారత్ లో కొత్త నాణేలను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించింది. రూపాయి నుంచి 20 రూపాయల వరకు కొత్త రూపంలో ఇవి ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఆర్ధిక వ్యవస్థ అవసరాలు తెలిసిన వారు కాబట్టి ప్రభుత్వం ... ఆర్ధిక శాఖ ఇలాంటి ప్రజోపకరణ నిర్ణయాలు తీసుకొంటాయి. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఇప్పటికే చెలామణిలో ఉన్న నాణేల పరిస్థితి గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటె... రకరకాల అపోహలు, అనుమానాల మధ్య కొంత కాలంగా పౌరులు ఎవరు రూ 10 నాణేలను తీసుకోవటం లేదు. ముఖ్యంగా వర్తకుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆటోలు, కిరణా షాపులు, చికెన్ సెంటర్లు వంటి ఎలాంటి షాపుల్లోనైనా రూ 10 చెల్లందిగానే ఉంటోంది. దీంతో ప్రజలు కూడా వీటిని తీసుకొనేందు ముందుకు రావటం లేదు.

బ్యాంకులూ అంతే...
ఆర్ధిక వ్యవస్థకు పట్టుకొమ్మలు ఐన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం నాణేలు తీసుకొనేందుకు వెంకడుతున్నాయి. పౌరుల నుంచి అన్ని రకాల నాణేలను అన్ని బ్యాంకులు తప్పని సరిగా తీసుకోవాల్సిందేనని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఎన్నీ సర్క్యూలర్లు జారీ చేసినా కూడా ఫలితం ఉండటం లేదు. డిపాజిట్ చేసేందుకు తెచ్చిన నాణేలను దేశం లోని ఏ ఒక్క బ్యాంకు కూడా తిరసరించకూడదు అని ఈ నెల తోలి వరం లో కూడా రిజర్వు బ్యాంకు సర్కులర్ జారీ చేసింది. ఐన కూడా బ్యాంకులు స్పందించటం లేదు. అదేంటి అని బ్యాంకులను నిలదీస్తే .... పౌరులు ఎవరూ నాణేలను తీసుకొనేందుకు అంగీకరించటం లేదు. మా వద్దకు వచ్చిన నాణేలు అలాగే పోగుపడిపోతున్నాయి. వాటిని మెం ఎవరికి తిరిగి ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాయి. కర్ర పెత్తనం చేసే రిజర్వు బ్యాంకు కూడా మా వద్ద నుంచి నాణేలను తిరిగి తీసుకోదని.. అలాంటప్పుడు మేమెలా నాణేలను స్వీకరించాలి అని ఒక బ్యాంకు మేనేజర్ వాపోయారు.

చిల్లర కొరత :
ఒకప్పుడు మార్కెట్ లో చిల్లర కొరత పెద్ద ఇబ్బందిగా ఉండేది. ఏ లావాదేవీ కైనా చిల్లర దొరక్క అటు ప్రజలు, ఆపసోపాలు పడేవారు. ఇందుకోసం వ్యాపారాలు కమిషన్ ఇచ్చి మరీ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందిన ఏజెంట్ల ద్వారా చిల్లర సమీకరించుకొనేవారు. బిచ్చగాళ్ల నుంచి కూడా ఇదే పధ్ధతి లో చిల్లర జమ చేసుకోవటం తెలిసిందే. ఐదారేళ్ళ కింద మన హైదరాబాద్ లో చిల్లర కొరత ఏరపడటం వాళ్ళ వైన్ షాపులు, కొంత మంది చిన్న వ్యాపారాలు పాపేరుపై స్టాంప్ వేసి వాటినే నగదుగా చెలామణి చేసిన సందర్భాలు ఉన్నాయ్. అయితే ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారిపోవడం చూస్తున్నాం.

డిజిటల్ పేమెంట్స్ ప్రభావం:
మంచో చెడో... పెద్ద నోట్ల తర్వాత దేశంలో డిజిటల్ ప్రెమెంట్స్ పెరిగిపోయాయి. ప్రెటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆప్ ల రాక తో ఎంత చిన్న మొత్తంగా ఒకరినుంచి మరొకరికి నగదు బదిలీ చేసుకోవడం సులభం అయిపోయింది. ఆఖరికి పని పూరి బండి వాళ్ళు కూడా ఈ ఆప్ లను వినియోగిస్తున్నారు. దీంతో ప్రజలకు చిల్లర (నాణేల ) అవసరం తగ్గి పోతోంది. ఈ విషయాన్నీ ప్రభుత్వం గుర్తించి తదనుగూనంగా నిర్ణయం తీసుకొంటే మంచిదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

రూపాయి నుంచి ఇరవై వరకు...
ఇప్పటి వరకు దేశం లో చెలామణి లో ఉన్న నాణేలు 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు కాగా... కొత్త మార్కెట్ లోకి రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలతో పాటు 20 రూపాయల నాణేన్ని కూడా ప్రవేశ పెట్టనున్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 50 పైసల నాణేలు పెద్దగా కనిపించటం లేదు. 10 రూపాయల నాణేన్ని ప్రజలు తీసుకోవట్లేదు. వెల్లడించక పోయిన త్వరలో 50 పైసల నాణేలు కూడా చలామణి నుంచి వెళ్లి పోతాయనిపిస్తోంది. కొత్తగా ప్రవేశ పెట్టె నాణేలు రూపాయి నుంచే ప్రారంభం అవుతుండటం దీనికి సూచనగా అనిపిస్తోంది. మరి కొత్తగా వచ్చే నాణేలకు ఆదరణ ఎంత మేరకు ఉంటుందో చూడాలి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications