బంగారంపై దిగుమతి సుంకాన్ని 10% నుంచి 12.2 శాతానికి పెంచనున్నట్లుకేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. దీంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు పెంపుకు కారణాలను ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు. అత్యవసరం కాని వస్తువుల దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో పసిడి సహా పలు వస్తువులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిందని తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే తెలిపారు.

దర్యాఫ్తు సంస్థలు చూసుకుంటాయి
దర్యాఫ్తు సంస్థల స్మగ్లింగ్ సమస్యను కూడా పరిష్కరిస్తారని పాండే వెల్లడించారు. వాస్తవాల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు తప్ప, ఒక వ్యక్తి మిస్ యూజ్ చేసేలా తీసుకోరని వ్యాఖ్యానించారు. ఇంపోర్ట్ డ్యూటీని రెండున్నర శాతం పెంచడం వల్ల స్మగ్లింగ్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయేమోననే ప్రశ్నకు... ఆ విషయాలు దర్యాఫ్తు సంస్థలు చూసుకుంటాయని చెప్పారు.

విధానపరమైన నిర్ణయం
'నాన్ ఎసెన్షియల్ వస్తువుల దిగుమతిని తగ్గించే ఉద్దేశ్యంలో భాగంగా ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అనవసరమైన వస్తువుల దిగుమతి ద్వారా మన వద్ద ఉన్న విదేశీ కరెన్సీని ఖర్చు చేయడం మంచిది కాదు. ఇలాంటి వాటిలో బంగారం కూడా ఒకటి. దీనిని తక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటే చాలు. మన వరకు సంబంధించి టన్నుల కొద్ది అవసరం లేదని' ఆయన వెల్లడించారు. ఇది విధానపరమైన నిర్ణయం కాదని, స్మగ్లింగ్ ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ చూసుకుంటుందని చెప్పారు.

బంగారం ధర 15.5 శాతం పెరుగుతుంది
అనవసరమైన దిగుమతులను అరికడుతున్నామని, ఇది కూడా మంచి ఆర్థిక విధానమని ఆయన చెప్పారు. సుంకం 12.5 శాతానికి పెంచితే స్మగ్లింగ్‌ను ప్రోత్సహించినట్లవుతుందని చెబితే, అంతకుముందు 10 శాతానికి పెంచినప్పుడు కూడా ఇది వర్తిస్తుందని, కాబట్టి అవన్నీ సరికాదని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఆల్ ఇండియా జెమ్ అండ్ జెవెల్లరీ డొమెస్టిక్ కౌన్సెల్ చైర్మన్ ఎన్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ... కస్టమ్ డ్యూటీ పెంపుతో పాటు జీఎస్టీ కారణంగా బంగారం ధర 15.5 శాతం పెరుగుతుందని చెప్పారు. కాగా, 2018-19లో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్స్ 5.32 శాతం తగ్గాయి. అలాగే, బంగారం దిగుమతులు 3 శాతం తగ్గాయి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications