అప్పుల్లో కూరుకుపోయిన కేంద్ర విమానయాన సంస్థ ఎయిరిండియాను ఔట్‌రైట్‌గా అమ్మిపారేయాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చేసింది. అయితే ఇందుకోసం ఈ ఏడాది అక్టోబర్‌ను డెడ్‌లైన్‌గా నిశ్చయించుకుంది. తాజా బడ్జెట్‌లో కూడా పెట్టుబడి ఉపసంహరణ లక్ష్యాలను నిర్దేశించుకున్న నిర్మలా సీతారామన్, ఇక ఎయిరిండియా అమ్మకం విషయంలో ఎలాంటి ఆలస్యమూ చేయకపోవచ్చని అనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టాటాలు.. ఎయిరిండియాపై అమిత ఆసక్తితో ఉన్నారు.

బిడ్డింగ్ ప్రక్రియ షురూ
కొద్దికాలం క్రితం వరకూ ఎయిరిండియాను అమ్మేసే విషయంలో కేంద్రం తీవ్రంగ కసరత్తు చేసింది. ఇది అప్పట్లో సక్సెస్ కాలేదు. అయితే ఈ సారి నిబంధనల్లో అనేక మార్పులు చేసి నష్టభరిత సంస్థను వదిలించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం గతంలో బిడ్లు దాఖలు చేసిన వాళ్లతో సంప్రదింపులు జరపడంతో పాటు త్వరలో కొత్తవాటికి ఆహ్వానం పలకబోతోంది. మొన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా ఇదే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పారు. వివిధ రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు పెట్టుబడుల ఉపసంహరణపై కూడా సుదీర్ఘమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడంతో ఒత్తిడి పెరుగుతోంది.
కేంద్రం త్వరలో ఎయిరిండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (AISAM)పేరుతో ఒక వ్యవస్థను తీర్చిదిద్దబోతోంది. దీని ఏర్పాటు తర్వాత కొత్తగా మళ్లీ బిడ్లను ఆహ్వానించబోతున్నారు. ఈ వ్యవస్థకు సర్వహక్కులూ ఇచ్చి మొత్తం ప్రక్రియ సులువుగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం పడడమే ఆలస్యం.

ప్రధానే స్వయంగా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఐసం బోర్డ్ ఏర్పాటు కానుంది. అందులో ఆర్థిక మంత్రి, రోడ్లు- రవాణా మంత్రి, వాణిజ్య శాఖ మంత్రి, పౌరవిమానయాన శాఖా మంత్రి, రైల్వే మంత్రి సభ్యులుగా ఉంటారు. ఐసం గతంలో 2017లో ఏర్పాటైనా పెద్దగా అడుగులు ముందుకు పడలేదు. ఇప్పుడు కేబినెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకోవడంతో కొత్త కమిటీ ఏర్పాటై ఎయిరిండియా అమ్మకాన్ని వేగిరం చేయాలని చూస్తోంది.
మొత్తం 95 శాతం వాటాను అమ్మేయాలని చూస్తున్నారు. మిగిలిన 5 శాతాన్ని ఉద్యోగుల స్టాక్ ఆప్షన్స్ కింద వదిలేసి ఔట్ రైట్ సెల్లింగ్ కోసం కేంద్రం పావులు కదుపుతోంది. ఇందుకోసం వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ విధానాల్లో కూడా మార్పులు చేయబోతోంది.

రోజుకు రూ.15 కోట్ల నష్టం
ఎయిరిండియాను ఈ పరిస్థితుల్లో నడపాలంటే రోజుకు రూ.15 కోట్లు ఖర్చవుతోంది. ఇదంతా నష్టమే. ఇలా ఇంకా ఎన్ని రోజులు నడిపినా నష్టమే తప్ప ప్రయోజనం లేదు. అందుకే వెంటనే వదిలించుకోవాలని కేంద్రం చూస్తోంది. అందుకే ఎయిరిండియాతో పాటు అనుబంధ సంస్థలను కూడా అమ్మేసి రూ.27వేల కోట్ల అప్పును ఏదో ఒక విధంగా తగ్గించాలనేది కేంద్రం లక్ష్యం.

ఇప్పటికైనా లక్ కలిసొస్తుందా ?
ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టాలని టాటా గ్రూప్ రెండు, మూడు దశాబ్దాలుగా చేయని ప్రయత్నమంటూ లేదు. ఏదో ఒక అవాంతరంతో దానికి బ్రేకులు పడ్తూ వస్తున్నాయి. చివరకు ఎయిర్ ఏషియాతో కొంత ముచ్చట తీర్చుకునే ప్రయత్నం చేసినా అది పూర్తిగా విజయవంతంకాలేదు. దీంతో టాటాలు కూడా ఈ రంగంలో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications