రూ.2,500కు 50 ఎంబీపీఎస్ JioGigaFiber ప్లాన్, ఈ సేవలుండవు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో... జియో గిగా ఫైబర్ ప్లాన్ కింద రూ.2,500కు 50Mbps ఆఫర్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే జియో గిగా ఫైబర్‌ను పలు ప్రాంతాల్లో జియో పరీక్షిస్తోంది. ఇందుకు చాలా తక్కువ మొత్తం ఛార్జ్ చేస్తోంది. ఇప్పుడు, అతి తక్కువ ధరకు 50 ఎంబీపీఎస్ ఇచ్చే ప్లాన్ చేస్తోంది.

జియో గిగా ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ పరీక్షలు నిర్వహిస్తున్న జియో.. కస్టమర్ల నుంచి రూ.4,500 సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకొని సేవలు అందిస్తోంది. ఇది 100Mbps వస్తుంది. ఈ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్. అంటే తిరిగి చెల్లిస్తారు.

జియో గిగా ఫైబర్ టెస్టింగ్ కోసం మరో ఆఫర్‌తో ముందుకు వస్తోందని చెబుతున్నారు. కేవలం రూ.2,500 సెక్యూరిటీ డిపాజిట్ పాన్‌తో 50Mbps స్పీడ్‌తో సబ్‌స్క్రిప్షన్ ఇవ్వనుందని తెలుస్తోంది. అంటే, ఇంతకుముందు ఆఫర్ కంటే రూ.2,000 తక్కువకు, సగం స్పీడ్‌తో ఇవ్వనుంది. గిగా ఫైబర్ ఆఫర్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూసేందుకు ఈ ఆఫర్ తీసుకు వస్తోందట. అయితే రూ.4,500 కంటే రూ.2,500 ఆఫర్‌లో కొన్ని ప్రయోజనాలు అందవు.

Reliance Jio offering 50Mbps JioGigaFiber plan for Rs 2,500

ముఖ్యంగా 100 Mbpsకు బదులు 50Mbps వస్తుంది. అలాగే, రూటర్ కేవలం డబుల్ బాండ్‌కు బదులు సింగిల్ బ్యాండ్ చానల్‌ను సపోర్ట్ చేస్తుంది. గిగా ఫైబర్ సర్వీస్‌లో వాయిస్ సేవలు, జియో టీవీ యాక్సెస్ ఉంటాయి.

జియో గిగా ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ జూలై 2018న ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే కమర్షియల్‌గా లాంచ్ చేయాల్సి ఉంది. FTTH (ఫైబర్ టు ది హోమ్) ను భారత్‌లోని దాదాపు 1,100 నగరాల్లోప్రారంభించనున్నారని తెలుస్తోంది.

త్వరలో జియో గిగా ఫైబర్ కాంబో ప్లాన్ రానుంది. ఇందులో ఫైబర్ ఇంటర్నెట్, లాండ్‌లైన్, టీవీ సేవలు ఉంటాయి. ఈ ప్యాకేజీ నెలకు రూ.600గా ఉండనుందని తెలుస్తోంది. జియో గిగా ఫైబర్ స్మార్ట్ హోమ్ నెట్ వర్క్‌తో దాదాపు 40 డివైస్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇందుకు రూ.1,000 చెల్లించవలసి ఉంటుందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+