For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్భణంపై తక్కువే'

|

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పైన సెస్ విధించినప్పటికీ ద్రవ్యోల్భణంపై స్వల్ప ప్రభావమే చూపుతుందని ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి ఈ ఏడాదికి డివిడెండ్‌గా రూ.90,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ద్రవ్యోల్భణం ఎక్కువగా లేదని, 4 శాతంగా ఉందని చెప్పారు.

ఇదిలా ఉండగా, బడ్జెట్ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. శనివారం లీటర్ పెట్రోల్‌కు రూ.2.45 పైసలు, లీటర్ డీజిల్‌కు రూ.2.36 పైసలు పెరిగింది. ఈ ప్రభావం నిత్యావసర వస్తువులపై కూడా పడుతుంది. పెరిగిన తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.96 పైసలు, ముంబైలో రూ.78.57 పైసలు, కోల్‌కత్తాలో రూ.75.15 పైసలు, చెన్నైలో రూ.75.76 పైసలకు చేరింది.

బడ్జెట్ ఎఫెక్ట్: రూ.2.5 పెరగనున్న పెట్రోల్, డీజిల్ రూ.2.3, భారీగా పెరిగిన బంగారం ధర బడ్జెట్ ఎఫెక్ట్: రూ.2.5 పెరగనున్న పెట్రోల్, డీజిల్ రూ.2.3, భారీగా పెరిగిన బంగారం ధర

Fuel Price Hike To Have Very Marginal Impact On Inflation: Finance Secretary

ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.69.60 పైసలు, ముంబైలో రూ.69.60 పైసలుగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఉండే వ్యాట్ కారణంగా ధరల్లో స్వల్ప తేడాతో మిగతా పట్టణాల్లోను ఇలాగే ఉంది. బడ్జెట్ కంటే ముందు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.17.98 ఉండగా, బడ్జెట్ ప్రతిపాదనలతో ఎక్సైజ్ సుంకం రూ.19.98కు చేరుకుంది. లీటర్ డీజిల్‌పై రూ.13.83 ఉండగా, బడ్జెట్ అనంతరం రూ.15.83కు చేరుకుంది.

English summary

'పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్భణంపై తక్కువే' | Fuel Price Hike To Have Very Marginal Impact On Inflation: Finance Secretary

Finance Secretary Subhash Chandra Garg said increased petrol and diesel prices after the duty hike will have "very marginal impact" on inflation and any worry on that front is immaterial. He also said the government expects Rs.90,000 crore from the Reserve Bank of India as dividend during the current fiscal year.
Story first published: Sunday, July 7, 2019, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X