అమెజాన్ సీఈవో విడాకుల ఖరీదు 38 బిలియన్ డాలర్లు
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్యతో విడాకులు తీసుకన్నాడనే విషయం తెలిసిందే. 25 ఏళ్ల పాటు జీవనం సాగించిన వీరు కొద్ది నెలల క్రితం విడిపోయారు. బెజోస్ సంపదతో పాటు విడాకుల సెటిల్మెంటులోను రికార్డ్ సృష్టిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకుల ఒప్పందం ఇది కానుంది. విడాకుల భరణం కింద తన భార్య మెకంజీ బెజోస్‌కు 38.5 బిలియన్ డాలర్లు ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
మెకంజీకి 68 బిలియన్ డాలర్లు అందనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే వాషింగ్టన్ సీటెల్ కోర్టు జడ్జి 38.5 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదిర్చారట. మరోవైపు, భార్యకు అంతమొత్తం భరణంగా ఇచ్చినప్పటికీ ప్రపంచంలో ఆయనే అత్యంత సంపన్నుడిగా నిలవనున్నారు. జెఫ్ బెజోస్ విజయం వెనుక మెకంజీ పాత్ర ఎంతో ఉంది. 1992లో న్యూయార్క్‌లో హెడ్జిఫండ్ సంస్థ డి.ఈ.షాలో కలిసి పనిచేశారు. ఈ సంస్థకు జెఫ్ బెజోస్ ఉపాధ్యక్షుడిగా ఉండగా, మెకంజీ రీసెర్చి అసోసియేట్‌గా ఉండేవారు. 1993లో పెళ్లి చేసుకున్నారు.

ఈ సెటిల్మెంట్ ద్వారా మెకంజీకి వచ్చే మొత్తంతో ఆమె ప్రపంచంలో మూడో ధనిక మహిళగా నిలవనున్నారు. తన ధనంలో సగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించేందుకు ఆమె గివింగ్ ప్లెడ్జ్‌లో మే నెలలో సంతకం చేశారు. గివింగ్ ప్లెడ్జ్‌కు సంతకం చేసిన 200కు పైగా దాతల్లో ఈమె ఒకరు. దాతృత్వం కోసం సహాయం కొనసాగుతుందని ఆమె తెలిపారు. విడాకుల ఒప్పందం కింద అమెజాన్ షేర్లలో నాలుగు శాతం లేదా 19.7 మిలియన్ల షేర్లు మెకంజీ పేరు మీద రిజిస్టర్ చేయనున్నారని మే నెలలో వార్తలు వచ్చాయి. అప్పటికీ బెజోస్ 114.8 బిలియన్ డాలర్ల విలువ కలిగిన 12 శాతం షేర్లు బెజోస్ కలిగి ఉంటారు.


Click it and Unblock the Notifications