మెల్లిగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి రైల్వే ! ఇదిగో సాక్ష్యం

రైల్వే మెల్లిగా ప్రైవేటు పరం కాబోతోందా? ప్రముఖ రైళ్ల నిర్వాహణ కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్తుందా? చూడబోతే ఇందుకు పెద్ద దూరం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. నిన్నటి బడ్జెట్లో ఇదే విషయాన్ని అత్యంత స్పష్టంగా సూచించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక్కడి నుంచి పదేళ్ల కాలానికి రైల్వేల అభివృద్ధికి రూ.50 లక్షల కోట్లు అవసరమన్న ఆమె, ఇది ప్రభుత్వంతో సాధ్యపడదని తేల్చిచెప్పేశారు. రైల్వేల విస్తరణ, అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరనేది ఆమె మాటల్లో స్పష్టమైన భావన. ఇంతకీ ఈ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ హైలైట్స్ ఏంటి.

రైల్వేలకు రూ.1.60 లక్షల కోట్లు

రైల్వేలకు రూ.1.60 లక్షల కోట్లు

గతంలో ఎప్పుడూ లేని విధంగా విస్తరణ, ఖర్చుల కింద రైల్వే శాఖకు ఈ సారి రూ.1,60,175.64 కోట్లను కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించింది. ఇంత వరకూ రైల్వేల చరిత్రలో ఈ స్థాయి కేటాయింపులు జరగలేదు. గత మధ్యంతర బడ్జెట్లో కూడా ఈ కేటాయింపు రూ.4.18 లక్షల కోట్లకు పరిమితమైంది.

కేటాయించిన ఈ నిధుల్లో రూ.65387 కోట్లు బడ్జెటరీ మద్దతు కింద, రూ. 267 కోట్లు నిర్భయ ఫండ్ నుంచి, రూ.10500 కోట్లు అంతర్గత నిధుల నుంచి ఇవ్వడంతో పాటు మరో రూ.83571 కోట్లను అదనపు బడ్జెటరీ నిధుల నుంచి కేటాయించింది కేంద్రం.

దేనికి ఎంతెంత

దేనికి ఎంతెంత

కేటాయించిన నిధుల్లో రూ.7677 కోట్లను500 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల విస్తరణకు, రూ.3118 కోట్లు 600 కిమీల గేజ్ కన్వర్షన్‌కు ఖర్చు చేయబోతున్నారు. ప్రధానంగా 2650 కిమీల లైన్లను డబ్లింగ్ చేయడానికి రూ.17600 కోట్లను, విద్యుదీకరణకు మరో రూ. 7000 కోట్లను ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు జరిపారు.

జీతాలకే రూ.87 వేల కోట్లు

రైల్వే ఉద్యోగుల జీతాలకే అత్యధికంగా రూ.86740 కోట్లు ఖర్చవుతోంది. అయితే ఆదాయంలో మాత్రం భారీగా వృద్ధి ఎక్కడా కనిపించడంలేదు. ఈ ఏడాది ఆదాయం రూపంలో రూ.216935 కోట్లు వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రయాణీకుల ఆదాయం ద్వారా రూ.56000 కోట్లు (గతేడాది రూ.52వేల కోట్లు), గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా రూ.131565 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది.

ప్రయాణీకుల సేవలకు రూ.3422 కోట్లు

ప్రయాణీకుల సేవలకు రూ.3422 కోట్లు

ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించేందుకు అమినిటీస్ కోసం రూ.3422.57 కోట్లను కేంద్రం ఈ బడ్జెట్లో కేటాయించింది. గతంతో పోలిస్తే ఇది రెట్టింపు. రాజధాని, శతాబ్ది తరహాలో నాణ్యమైన సీట్లు, సేవలు ఉన్న రైళ్లను మరింతగా విస్తరించాలని కేంద్రం చూస్తోంది.

ప్రైవేటు పరం

ప్రైవేటు పరం

ఫ్రాన్స్ భాగస్వామ్య పెట్టుబడితో మధ్యప్రదేశ్‌లోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్‌ను మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి మరిన్ని హబ్స్ అభివృద్ధి చేసేందుకు కేంద్రం 7 లక్షల యూరోలతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో మొదటిసారిగా ర్యాపిడ్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం అభివృద్ధి చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఖచ్చితంగా ప్రైవేటు భాగస్వామ్యం ఉండబోతోంది.

వీటితోపాటు సబర్బన్ ప్రాంతాలు, ఫ్రైట్ కారిడార్ల అభివృద్ధికి కూడా ప్రైవేటు సహకారం తీసుకోబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఈ లెక్కన మెల్లిగా రైల్వే స్టేషన్లను, ఆ తర్వాత ఫ్రైట్ కారిడార్లను, ఆ పై రైళ్లను ప్రైవేట్ వైపు అడుగులు వేయించేట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ రోజుకు కోట్ల మంది దిగువ మధ్యతరగతి వాళ్లకు రైల్వేల ప్రయాణ సాధనం అయిన నేపధ్యంలో వారి గురించే ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+