కిలో టమోటా ౩౦వేలు .. లీటర్ పాలు 50వేలు .. అక్కడ టాయిలెట్ పేపర్ గా కరెన్సీ ... ఎందుకిలా

వెనిజులా విలవిలలాడుతుంది. ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుకుని నరకం చూస్తుంది. కిలో టమాటా... 30,000కి, లీటరు పాలు 50,000 కు కొనాల్సి వస్తుంది అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ప్రస్తుతం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలతో అస్తవ్యస్తమైన వెనెజులా దేశంలో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది .

కరెన్సీ విలువ పడిపోవడం,ఆహారం మొదలైన నిత్యావసరాల కొరత నెలకొనడం, దానికి తగ్గట్లుగా రేట్లు నిమిషానికొకసారి విపరీతంగా పెరిగిపోవడం దీనికి కారణంగా కనిపిస్తుంది . దీంతో ఒక దశలో టాయ్‌లెట్‌ పేపర్‌ను కొనుక్కోవడానికి బదులు కరెన్సీ నోట్లనే టాయ్‌లెట్‌ పేపర్‌గా వాడుకుంటున్నారంటే పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అంటే టాయిలెట్ పేపర్ కూడా కొనలేని స్థితిలో వెనిజులా కరెన్సీ విలువ పడిపోయిందన్న మాట .

కరెన్సీ విలువ పడిపోవటం , నిత్యావసరాల సరఫరా కొరత .. వెనిజులా సంక్షోభానికి కారణం

కరెన్సీ విలువ పడిపోవటం , నిత్యావసరాల సరఫరా కొరత .. వెనిజులా సంక్షోభానికి కారణం

క్రూడాయిల్‌ ధరలు పడిపోవడంతో వెనిజులా కరెన్సీ బొలివర్‌ కూ డిమాండ్‌ విపరీతంగా పడిపోయింది. విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల భారం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం మరింత ఎక్కువగా కరెన్సీని ముద్రించింది. చేతి నిండా డబ్బున్నా కావాల్సిన నిత్యావసరాలు దొరకని పరిస్థితి .దీంతో అందరి చేతుల్లో డబ్బు ఉన్నప్పటికీ నిత్యావసరాల సరఫరా పరిమితంగా ఉండటంతో వాటి రేట్లు పెరిగిపోయాయి. చివరికి ఇదో విషవలయంలా తయారైంది. ఇది గాక, దాచుకున్న డబ్బును వెనిజులా వాసులు అమెరికన్‌ డాలర్లలోకి మార్చుకోవడం మొదలెట్టారు.దీంతో డాలర్లకు డిమాండ్‌ పెరిగి.. వెనెజులా బొలివర్‌ మారకం రేటు మరింతగా పడిపోయింది.

సుమారు 30 లక్షల మంది వెనిజులా వాసులు దేశం విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి

సుమారు 30 లక్షల మంది వెనిజులా వాసులు దేశం విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి

ప్రభుత్వం నియంత్రణ విధించడంతో బ్లాక్‌ మార్కెట్‌ జోరందుకుంది. అధికారిక మారకం రేటుకు.. బ్లాక్‌మార్కెట్‌ రేటుకూ భారీ వ్యత్యాసాలు వచ్చేయడంతో వెనెజులా కరెన్సీ విలువ మరీ పాతాళానికి పడిపోయింది. ఆహారం దగ్గర నుంచి ప్రతీ దానికి కొరత నెలకొనడంతో దేశ జనాభాలో 10శాతం అంటే సుమారు 30 లక్షల మంది వెనిజులా వాసులు దేశం విడిచి వెళ్లిపోయారు.ప్రస్థుతం వెనెజులా ప్రభుత్వం పాత కరెన్సీ బొలివర్ ఫుర్టె స్థానంలో బొలివర్ సోబ్రానో కరెన్సీని ప్రవేశపెట్టింది.బక సోబ్రానో లక్ష పుర్టెలకు సమానం.అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF) అంచనా ప్రకారం...ఈ ఏడాది చివరినాటికి వెనెజులాలో ద్రవ్యోల్బణం 10లక్షల శాతానికి చేరుకోనుంది.

సంక్షోభం నుండి బయట పడటానికి ఏ చర్యలు చేపట్టని ప్రభుత్వం .. భారీగా నిరసనలు

సంక్షోభం నుండి బయట పడటానికి ఏ చర్యలు చేపట్టని ప్రభుత్వం .. భారీగా నిరసనలు

డబ్బు ఉన్నా ఏం లాభం నిత్యావసరాలు లేకుంటే అన్న భావన వెనిజులా వాసుల్లో వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరిస్తుంది . కరెన్సీ విలువ పడిపోవడం,ఆహారం మొదలైన నిత్యావసరాల కొరత నెలకొనడం, దానికి తగ్గట్లుగా రేట్లు నిమిషానికొకసారి విపరీతంగా పెరిగిపోవడం వంటి అంశాలు వెనిజులా వాసులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వెనిజులా ఆర్థిక సంక్షోభం తీవ్రమైన రాజకీయ, సామాజిక సంక్షోభానికి దారితీసింది. మహామాంద్యంలో (1929) ఉన్నప్పుడు అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలినప్పుడు (1990) రష్యా కూడా ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కొలేదు. వెనిజులాలో దాదాపు ముప్ఫై లక్షల మంది తినడానికి తిండి లేక దేశం విడిచి వలసపోయారని అంచనా. దేశవ్యాప్తంగా భారీగా నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. అయితే ప్రభుత్వ వైఫల్యం పట్ల ప్రజలు అసంతప్తిగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల మీద ప్రజలకు ఏమాత్రం సానుభూతి లేదు. ప్రతిపక్షాలన్ని కలిసి కూడా తగిన ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+