ఢిల్లీ: పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బంగారంపై దిగుమతి సుంకం పెంచడంతో ఒక్కసారిగా బంగారం ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి.దేశీయ కొనుగోలు దారుల నుంచి పసిడికి తెగ డిమాండ్ ఏర్పడింది. దీంతో డీలర్లు గత మూడేళ్లలో ఎప్పుడే లేనంతగా తగ్గింపు ధరతో పుత్తడిని అమ్మాల్సి వచ్చింది. భారత్‌లోని డీలర్లు రూ. 2.053 తగ్గింపు ధరతో బంగారంను ఇచ్చినట్లు సమాచారం. 2016 తర్వాత ఈ స్థాయిలో తగ్గించి ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
శుక్రవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ బంగారంపై దిగుమతి సుంకాన్ని 12.5శాతం వరకు పెంచుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఇది 10శాతంగా ఉండేది. కేంద్రం ప్రకటించిన ఈ పెంపుతో రిటెయిల్ డిమాండ్ దెబ్బతీయడమే కాదు... స్మగ్లింగ్‌కు కూడా ఊతమిచ్చినట్లువుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బంగారంను తగ్గించి ఇస్తున్నప్పటికీ ప్రజలు పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపలేదని ఓ బంగారం దుకాణం నడిపే ఓనర్ చెప్పాడు.

ఇక బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రమంత్రి ప్రకటనతో పుత్తడి ధర 10 గ్రాములపై 2శాతం ధర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.35,100కు పెరిగింది. మరోవైపు గత ఆరువారాల్లో స్థానికంగా బంగారు ధరలు 11శాతం పెరిగినట్లయ్యింది. ఇదిలా ఉంటే ముంబైలోని బంగారు వ్యాపారులు బడ్జెట్ ప్రకటన ఉన్న నేపథ్యంలో పసిడిని కొనలేదు. దిగుమతి సుంకం తగ్గుతుందనే ప్రకటన కేంద్రం నుంచి వస్తుందన్న వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. అయితే కేంద్రం ఒక్కసారిగా దిగుమతి సుంకం పెంచడంతో షాక్‌కు గురైన వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications