అంతకంతకూ పెరిగిపోతున్న అద్దెల కారణంగా ఫుడ్ డెలివరీ కంపెనీలు కొత్త పంథాను ఎంచుకొంటున్నాయి. అదే క్లౌడ్ కిచెన్స్. ప్రస్తుతం భారత్ లో మహా నగరాలూ, పట్టణాల్లో కమర్షియల్ భవనాల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక రెసౌరెంట్ గానీ ఫుడ్ కోర్ట్ కానీ నెలకొల్పాలంటే ... వాటి నెల వారీ ఆదాయాల్లో అద్దెల వాటినే 25-30% ఉంటోంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ చేర్చు 15% లోపే ఉండటం గమనార్హం. దీంతో నిర్వహణ భారం తడిసి మోపెడు అవుతోంది. దీన్ని గమనించిన ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గి, ఫాసూస్, ఫ్రెష్ మెనూ తదితర సంస్థలు రప్పటికే క్లౌడ్ కిచెన్ రౌటను ఎంచుకొంటున్నాయి.
సిటీ లోని అద్దె తక్కువగా ఉండే ఒక ప్రాంతంలో ఒక చిన్న సైజు (1,000 చదరపు అడుగుల స్థలం ) అద్దెకు తీసుకొని... అక్కడే అన్ని రకాల వంటకాలు వండిన తర్వాత వాటికీ మినీ తృక్స్ లో నగరం లోని అన్ని ప్రాంతాల్లో ఉన్న రెస్టరెంట్లు లేదా ఫుడ్ కోర్టులకు సరఫరా చేస్తారు. దీంతో నిర్వహణ ఖర్చులు భారీగా మిగులుతాయి. ఒకే సారి పెద్ద మొత్తం లో ఆహారాన్ని తయారు చేయడం వాళ్ళ ఖర్చు బాగా తగ్గుతుంది. ఒక్కో రెస్టారెంట్కు ఓకే మాస్టర్ చెఫ్ ఉండే బదులు ఈ పద్ధతిలో ఒకే ఒక్క చెఫ్ తో పని పూర్తి అవుతుంది.

భారీ నష్టాలే కారణం
ఫుడ్ డెలివరీ లో నింగనమైన స్విగ్గి, జొమాటో, ఫాసోస్, ఫుడ్ పాండా, ఉబెర్ ఇట్స్ వంటి కంపెనీలు భారీ నష్టాలను చవి చూస్తున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి దారులు నష్టాలను తగ్గించుకొని లాభాల బాట లో పయనించాలని ఒత్తిడి తెస్తున్నారు. భారీ డిస్కౌంట్స్ ఇవ్వక పొతే కస్టమర్లు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం లేదు. అందుకే వీటిపై ఒత్తిడి పెరుగుతోంది. కొత్త కస్టమర్లను ఆకర్షించటం లేదా ఉన్న వారిని మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసేలా చూడటం వీటికి కష్టతరం అవుతోంది. ఈ ఇబ్బందుల నుంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ ఐడియా.

కొత్తదేమీ కాదు కానీ ...
పేరు కొత్తది కానీ ... క్లౌడ్ కిచెన్ విధానం లో ఫుడ్ సరఫరా అనేది పాత విధానమే. మన హైదరాబాద్ లోనే చాల చైన్ రెస్టారెంట్లు ... బిర్యానీ విక్రయించే స్టాళ్లు ఈ పద్దతిని పాటిస్తున్నాయి. అయితే దీనిని పెద్ద ఎత్తున అమలు చేయడం మాత్రం ఇటీవలే ఊపందుకొంటోంది. బెంగళూరు, పూణే, ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈ పద్ధతికి మంచి ఆదరణ లభిస్తోంది.

మెరుగైన వ్యాపార అవకాశం...
క్లౌడ్ కిచెన్ పధ్ధతిలో మెరుగైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని నిపులును పేర్కొంటున్నారు. అతి తక్కువ ఖర్చులో పెద్ద మొత్తంలో ఆహారాన్ని సిద్ధం చేయడం, ఒకసారి అనేక ప్రాంతాలకు సమయానికి సరఫరా చేయగలగడం దీని ప్రత్యేకత. ఒకే క్లౌడ్ కిచెన్ లో వివిధ రెస్టారెంట్ల చెఫ్ లు కలిసి కూడా వారివారి మెనూ ఆధారంగా ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు. తద్వారా ఖర్చులను పంచుకోవచ్చు. వాహనాల్ని సైతం సంయుక్తంగా నిర్వహించు కోవచ్చు. ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టుప్ కంపెనీలకు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూర్చు తుండటం వాళ్ళ కొత్త ఔత్సాహక పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications