అఖండ మెజారిటీతో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా నేతృత్వం లోని ఎన్డీయే ... తన తోలి బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశ పెట్టింది. తొలిసారి ఒక మహిళా ఆర్ధిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతుండటం తో అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే నిర్మల సీతారామన్ దాదాపుగా అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా తన తోలి పూర్తిస్థాయి బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. మిగతా రంగాలపై బడ్జెట్ ప్రభావం పై దాదాపుగా అన్ని మీడియా లో రక రకాల కథనాలు విశ్లేషణలు వస్తున్నా... మన కరెన్సీ రూపాయి పయనం ఎటు అనేది అంశంపై అతి తక్కువ సమాచారం లభిస్తోంది. అందుకే... మీ అందరి కోసం ఈ విశ్లేషణాత్మక కథనం.

స్వతంత్రం వచ్చినప్పుడు డాలర్ = 3 రూపాయలు
అమెరికా డాలర్ తో పోల్చితే భారత కరెన్సీ ఐన రూపాయి .. నానాటికీ పతనం అవుతుండటం చూస్తున్నాం. కానీ మనకు స్వతంత్రం వచ్చిన ఏడాది ... అంటే 1947 లో 1 అమెరికా డాలర్ మన 3 రూపాయలతో సమానం. అప్పటికి మన దేశ కరెన్సీ మారకం ప్రపంచ వ్యాప్తంగా జరగ లేదు. ఒక బ్రిటిష్ పౌండ్ కు రూ 13 లక్క చొప్పున ... మన రూపాయి విలువ అప్పుడు డాలర్ తో పోల్చితే రూ 3 గ ఉంది. కానీ 70 ఏళ్ళ స్వాతంత్ర్య భారతంలో మన కరెన్సీ విలువ దాదాపుగా ఏటా ఒక రూపాయి చొప్పున క్షీణిస్తూ వస్తోంది. ఇప్పుడు ఇది సుమారు రూ 70 స్థాయిలో ఉంది (ఈ రోజు రూ 68.40). మిగితా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా మన రూపాయి విలువ చాల తక్కువగానే ఉంటోంది. అంతెందుకు మన పొరుగు దేశం ... అన్నిట్లోనూ పోల్చి చూసుకొనే చైనా కరెన్సీ విలువ మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు కేవలం రెండు రూపాయలుగా ఉంటె... ఆర్ధిక సంస్కరణల అనంతరం.. చైనా కరెన్సీ విలువ పెరిగితే మన కరెన్సీ విలువ మంత్రం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక చైనా యువాన్ కు దాదాపు రూ 10 ఐంది.

ఎగుమతులకు మంచిదే...
ఒక దేశ కరెన్సీ మారకపు రేటు ఎంత తక్కువగా ఉంటె.. ఆ దేశం నుంచి చేసే ఎగుమతి దారులకు అంట ఎక్కువ బిజినెస్ వస్తుంది. ఎందుకంటె.. ప్రపంచ మార్కెట్లో ఒకే క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ ఏ దేశం లో తక్కువకు లభిస్తే అక్కడి నుంచి ఆయా వస్తువులను దిగుమతి చేసుకోవడం సహజం. గత 40 ఏళ్లలో చైనా ప్రపంచానికి ఇదే విషయాన్నీ అనేక మార్లు నిరూపించింది. కేవలం ఎగుమతులను పెంచుకొనేందుకే తన కరెన్సీ మారకపు రేటును సైతం చైనా పలు మార్లు తగ్గించడం చూశాం. ఇదే సూత్రం ఇప్పుడు భరత్ కూడా వర్తిస్తోంది. మన కరెన్సీ వేల్యూ తక్కువ ఉండటం వల్ల సాఫ్ట్ వేర్ ఎగుమతుల నుంచి అన్ని రకాల ఎగుమతి దారులు లబ్ది పొందుతున్నారు. మన ఎగుమతులు కూడా ఇటీవల భారీగా పెరగటం దీన్నే సూచిస్తోంది. అయితే.. మన దిగుమతి చేసుకొనే వస్తువులు మాత్రం ప్రియం అవుతాయి. చమురు, ఎలక్ట్రానిక్స్, వంట నూనెలు భారీ స్థాయిలో దిగుమతి తీసుకోని భారత్ కు ఇది ఇబ్బంది కారమే.

ఇప్పుడు దారెటు?
ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఈ బడ్జెట్ తర్వాత మన కరెన్సీ పరిస్థితి ఏంటి అనేదానిపై ఆసక్తి పెరిగిపోయింది. సహజంగానే.. మన దేశం లోకి స్టాక్ మార్కెట్ ద్వారా .. లేదంటే విదేశీ పెట్టుబడుల రూపంలో నిధులు భారత్ కు రావడం మొదలైతే... రూపాయి బలపడుతుంది. గత 5 ఏళ్ళతో పోల్చితే... భారత ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడు కొంచం ఆందోళన కరంగానే ఉన్న... ప్రస్తుత బడ్జెట్ ద్వారా మనకు ఢోకా లేదని, వచ్చే 5 ఏళ్ళలో మన ఆర్ధిక వ్యవస్థ మరింత పటిష్టం కానుందని స్పష్టమవుతోంది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. అలాగే విదేశీ పెట్టుబడులు కూడా అధికంగా వచ్చే అవకాలను సృష్టించే అవకాశం ఉంది. తద్వారా మన కరెన్సీ కొంత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి ఎప్పుడు బలపడుతుందో... యెంత మేరకు మెరుగవుతుందో... చూడాలి మరి. బడ్జెట్ రోజున రూపాయి 8 పైసలు బలపడింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications