నల్లధనాన్ని కట్టడి చేయాలి, విదేశాల్లో ఉంటున్న బ్లాక్ మనీని వెనక్కి తెప్పించాలి, నగదు లావాదేవీలకు పూర్తిస్థాయిలో నియంత్రించాలి.. ఇవీ గత ఐదేళ్లుగా ప్రభుత్వ లక్ష్యాలు. వీటిల్లో ఎంత వరకూ సక్సెస్ సాధించారు అనే అంశాన్ని పక్కకుబెడితే ఈ బడ్జెట్లో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం. అదేంటంటే ఒక బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి కోటి రూపాయల కన్నా ఎక్కువ నగదు తీసుకుంటే 2 శాతం పన్నును విధిస్తారు. ఇక వ్యక్తులే కాదు.. కంపెనీల కూడా నగదులో పెద్ద ఎత్తున లావాదేవీలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. సామాన్యులు అంతంతమొత్తాన్ని తీసే అవకాశం ఉండదు కాబట్టి మనకు సమస్య లేదు కానీ.. కంపెనీలకు, కోటీశ్వరులకు మాత్రం ఇది ఇబ్బందికర విషయమే.

మరో మెలిక
బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించకపోయినా కేంద్రం మరో కొత్త మెలికను పెట్టింది. అదేంటంటే.. ఇకపై ఇతరుల అకౌంట్‌లో మనం వాళ్ల అనుమతి తీసుకోకుండా నగదును డిపాజిట్ చేయలేము. అంటే ఇక మనం ఎవరి ఖాతాలో అయినా డబ్బును డిపాజిట్ చేయాలంటే వాళ్ల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందనేది కేంద్రం మాట. అయితే ఎంత మొత్తం పరిమితి దాటితే వాళ్ల అనుమతి కావాలి, అనుమతి ఎలా ఇవ్వాలి అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఒక వేళ ఇరు వర్గాలకూ తెలిసి లావాదేవీ జరుగుతున్నా.. అనుమతి పొందాల్సిన పరిస్థితిని కేంద్రం తెచ్చింది.

ఎందుకీ తలనొప్పి
అయితే జన్ ధన్ తెచ్చిన ఈ తంటతో కేంద్రం ఈ కొత్త మెలిక పెట్టింది. ఎందుకంటే డీమానిటైజేషన్ సమయంలో కొన్ని వేలాది జన్ ధన్ ఖాతాల్లో అకౌంట్ హోల్డర్లకు తెలియకుండా బయటి వ్యక్తులు నగదును డిపాజిట్ చేశారు. ఎప్పటికో కానీ ఖాతాదార్లకు ఈ విషయం తెలియలేదు.
దీంతో ఇలాంటి లూప్ హోల్స్‌ను అరికట్టేందుకు కేంద్రం ఈ తరహా మార్గదర్శకాలను త్వరలో బ్యాంకులకు ఇవ్వబోతోంది.

నెంబర్ ఉంటే చాలు...
ఇప్పుడున్న పరిస్థితుల్లో అవతలి వ్యక్తికి చెందిన బ్యాంక్ ఖాతా నెంబర్ తెలిస్తే.. ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసే సౌలభ్యం ఉంటుంది. నేరుగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా క్యాష్ డిపాజిట్ మెషీన్లలో కూడా నగదును జమ చేసే వీలుంది. ఈ లోపాన్ని ఆసరగా తీసుకుని గతంలో డిపాజిట్లు జరిగిన ఉదంతాలు కేంద్రం దృష్టికి వచ్చాయి.
అయితే ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. మాకు తెలియకుండా ఎవరో మా ఖాతాలో డబ్బు జమ చేశారు అని చెప్పి తప్పించుకునే అవకాశాన్ని కూడా కేంద్రం మూసేయబోతోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంత మంది ఈ మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఆ రూట్‌ను క్లోజ్ చేసేశారు. అయితే రాబోయే రోజుల్లో ఏదైనా పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ఉద్దేశంతోనే కేంద్రం ఇలా ముందు జాగ్రత్తలు తీసుకొంటోందా అనే అనుమానాలూ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications