న్యూఢిల్లీ: ఇంధనంపై రూ.1 సెస్ విధిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం నాడు తన బడ్జెట్‌లో పేర్కొన్నారు. అలాగే, బంగారం మీద కస్టమ్స్ డ్యుటీని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ పైన ఒక్కో రూపాయి చొప్పున సెస్ విధిస్తామని బడ్జెట్లో తెలిపారు. దీంతో ఈ ధరలు పెరగనున్నాయి.

పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరుగుతుందంటే?
పెట్రోల్ ధరలు రూ.2.5 పైసలు, డీజిల్ ధర రూ.2.3 పైసలు పెరగనుంది. ఫ్యూయల్ పైన ఎక్సైస్ సెస్‌తో పాటు రోడ్డు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ కలిపి రూ.2 పెరగనుంది. దీంతో రూ.28,000 కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ ట్యాక్స్ అనంతరం లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ కలుపుకుంటే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.2.50 పైసలు, డీజిల్‌కు రూ.2.3 పైసలు పెరగనుంది.

రూ.22 కోట్ల ఆదాయం
శుక్రవారం నాడు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.51 పైసలుగా ఉంది. ముంబైలో రూ.76.15 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.64.33 పైసలు, ముంబైలో రూ.67.40 పైసలుగా ఉంది. మొత్తంగా 220 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్‌కు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.22 కోట్ల ఆదాయం రానుంది.

కస్టమ్స్ డ్యుటీ ఇలా...
ఇప్పటి వరకు క్రూడాయిల్ పైన ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ వేయలేదు. కేవలం నేషనల్ కాలామిటి కాంటిగ్నెంట్ డ్యూటీగా టన్నుకు రూ.50 మాత్రం వేసింది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ వసూలు చేస్తోంది. పెట్రోల్ పైన ప్రస్తుతం ఎక్సైజ్ డ్యూటీ మొత్తం రూ.17.98 పైసలుగా ఉంది. ఇందులో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.2.98 పైసలు, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.7, రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూ.8గా ఉంది. ఇది కాకుండా రాష్ట్రాన్ని బట్టి వ్యాట్ ఉంది. ఢిల్లీలో వ్యాట్ 27 శాతంగా ఉంది. అంటే రూ.16.75 పైసలు. ముంబైలో వ్యాట్ 26 శాతంగా అంటే రూ.7.12 పైసలుగా ఉంది.

భారీగా పెరిగిన బంగారం ధరలు
మరోవైపు, బంగారంపై కస్టమ్ సుంకం పెరగడం వల్ల పసిడి ధర కూడా పెరగనుంది. ఇప్పటికే పసిడి రూ.34వేల మార్క్ దాటింది. శుక్రవారం ఒక్కరోజే రూ.590 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.34,800కు అటు ఇటుగా ఉంది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. బంగారం, వెండి, ఇతర లోహాలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతం పెంచనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications