ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు గంటలకుపైగా సుదీర్ఘంగా చేసిన బడ్జెట్ ప్రసంగంలో కోతల కంటే వాతలు ఎక్కువ పెట్టారు. ఉద్యోగులకు చెప్పుకోదగ్గ ఊరటేదీ లేకపోవడం ఒక నిరుత్సాహమైతే, సంపన్నులకు అధిక పన్నులు విధించి తమ టార్గెట్ ఎవరో స్పష్టంగా చెప్పారు. బంగారం, పెట్రోల్‌పై అధిక పన్నులు విధించి అటు మహిళలకు, ఇటు వాహనదారులకు కూడా గట్టి షాక్ ఇచ్చారు. మొత్తానికి రాబోయే ఐదేళ్లకు తమ రోడ్ మ్యాప్‌ను స్పష్టంగా వివరించింది మోడీ సర్కార్.

అంకెల గారడీల్లేవ్
మొదటి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి బడ్జెట్‌ను చాలా కాన్ఫిడెంట్‌గా ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. హిందీ, ఉర్దూ, తమిళ్, కన్నడ భాషల్లో కొంత మంది ప్రముఖులు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూనే తనదైన వాగ్ధాటిలో రెండు గంటలకుపైగా సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని చేశారు నిర్మల. ఎక్కడా తడబడకుండా, తొట్రుపాటులేకుండా కనీసం నీళ్లు తాగేందుకు బ్రేక్ కూడా తీసుకోకుండా ప్రసంగాన్ని కొనసాగించారు. అంకెల గారడీకి వెళ్లకుండా కనీసం బడ్జెట్ అంచనాలు, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, ఫిస్కల్ డెఫిసిట్, కేటాయింపుల అంశాలు ఏవీ చెప్పకుండా ప్రభుత్వ రోడ్ మ్యాప్‌ను ప్రధానంగా ఆమె ప్రస్తావించారు. 2022 కల్లా భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్దడంలో ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నాము అనే అంశం చుట్టూతూనే ప్రసంగం సాగింది.

ప్రైవేట్ దిశగా రైల్వేలు
రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ .. సంస్కరించు, పనితీరుకనబరుచు, అభివృద్ధి చేసి చూపించు.. అనే మాటలే తారక మంత్రంగా ఈ బడ్జెట్ సాగిందనేది నిర్మలా మాట. ముఖ్యంగా పది పాయింట్ల అజెండాతో ఈ బడ్జెట్ సాగింది. సామాజికంగా మౌలిక రంగ అభివృద్ధి, డిజిటల్ ఇండియా, కాలుష్య రహిత భారత్, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆయుష్మాన్ భారత్ వంటి కీలకమైన అంశాలే ప్రాతిపదికగా ఈ బడ్జెట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది మోడీ సర్కార్. గ్రామీణ భారతానికి పెద్దపీట వేస్తూనే కార్పొరేట్లకూ కొన్ని వరాలు ఇచ్చారు. అదే సమయంలో రాబోయే ఐదేళ్లలో 80 వేల కోట్ల రూపాయల ఖర్చుతో లక్షాపాతిక వేల కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టబోతున్నారు. సాగర్ మాల, భారత్ మాల ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తూనే రైల్వేల అభివృద్ధికి ప్రైవేటు భాగస్వామ్యం తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. 2030 నాటికి రైల్వేలకు రూ.50 లక్షల కోట్లు అవసరముందని, అయితే ఇందుకోసం ఏటా లక్షా,లక్షన్నర ఖర్చు చేస్తే దశాబ్దమైనా రైల్వేలు బాగుపడవనేది ఆమె మాట. అందుకే ప్రైవేటు భాగస్వామ్యంతో రైల్వేలను అభివృద్ధి చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇక జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రెండు శాతం తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు రూ.350 కోట్ల నిధులను కేటాయించారు. అతి తక్కువ సమయంలోనే రుణాన్ని పొందేందుకు ఆన్ లైన్ పోర్టల్‌ను కూడా మరింతగా అభివృద్ధి చేయబోతున్నారు.

ఇక ఊకదంపుడు చదువులుండవ్
పెట్టబడుల ఆకర్షణకు ఏటా గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్‌ను ఏర్పాటు చేరడంతో పాటు మరింతగా ఎఫ్ఐఐల పెట్టుబడుల ఆకర్షణకు మీడియా, ఏవియేషన్, యానిమేషన్ రంగాలను ఎంచుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇక విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురాబోతున్నారు. ఊరికే ఊకదంపుడు చదువులు కాకుండా పరిశోధనే లక్ష్యంగా చదువు ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆటల ప్రోత్సాహానికి ఖేలో ఇండియా అనే పథకానికి శ్రీకారం చుడుతూనే విదేశీ విద్యార్థులను ఇండియా వచ్చి చదివేలా ఇక్కడి విద్య ఉండాలని చూస్తున్నారు.
చివరగా..
ప్రత్యేకించి రైతులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, కార్పొరేట్లు అని చూడకుండా దేశం మొత్తానికి ఉపయోగపడే విధంగా హోలిస్టిక్ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టారు నిర్మలా సీతారామన్. అయితే కనీసం ఈ ఏడాది బడ్జెట్ ఎంత అనే సమాచారాన్ని కూడా ఇవ్వకుండా రెండు గంటలకుపైగా సాగతీత ఉపన్యాసం బోర్ కొట్టిందనేది కార్పొరేట్ల అభిప్రాయం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications