న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను శుక్రవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఓ మహిళ ఆర్థికమంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ఆర్థికమంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. నిర్మల తన మొదటి బడ్జెట్‌లో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్‌లో సంచలన, బ్రహ్మాండ నిర్ణయాలు తీసుకోలేదు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, సమీకృత ఆర్థిక వృద్ధి దిశగా ప్రతిపాదనలు చేశారు.

గ్రామీణ భారతం, వ్యవసాయానికి ఊతం
ఈ బడ్జెట్‌లో సంపన్నులపై కాస్త భారం పడుతుండగా, గ్రామీణ భారతం, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఆదాయ పన్నుపై రూ.5 లక్షల వరకు మినహాయింపును గత మధ్యంతర బడ్జెట్‌లోనే ఇచ్చినందున ఈసారి కూడా యథాతథంగా ఉంచారు. అయితే ఇతర ప్రయోజనాలు కల్పించారు. ప్రభుత్వం రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్లు మూలధన సహాయం కింద అందించనున్నారు.

ప్రతి రూపాయిలో ఇలా...
కాగా, ప్రభుత్వ ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 68 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుంచే వస్తున్నాయి. ప్రభుత్వ వ్యయంలో సింహభాగం అంటే 23 శాతం పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెల్లిస్తోంది. 18 పైసలు వడ్డీలకు చెల్లిస్తోంది. డిఫెన్స్‌కు 9 పైసలు ఖర్చు చేస్తోంది. కేంద్ర పథకాల కోసం 13 పైసలు ఖర్చు చేస్తోంది. బడ్జెట్ గణాంకాల ప్రకారం ప్రభుత్వానికి సమకూరే ప్రతి రూపాయి రాబడిలో జీఎస్టీ నుంచి వచ్చే ఆదాయం 19 పైసలుగా ఉంది. ప్రతి రూపాయిలో అత్యధికంగా కార్పొరేషన్ పన్ను వాటా 21 పైసలుగా ఉంది.

ఆదాయపన్ను వాటా 16 పైసలు
రుణాలు, ఇతర మార్గాల్లో సమీకరించే రాబడి ప్రతి రూపాయిలో 20 పైసలు కాగా, వసూలయ్యే ప్రతి రూపాయిలో ఆదాయ పన్ను వాటా 16 పైసలు. పెట్టుబడుల ఉపసంహరణ వంటి పన్నేతర రాబడుల నుంచి ప్రతి రూపాయిలో 9 పైసలు సమీకరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రభుత్వానికి సమకూరే ప్రతి రూపాయిలో 8 శాతం యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, 4 పైసలు కస్టమ్స్, 3 పైసలు రుణేతర పెట్టుబడి వసూళ్ల నుంచి వస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications