ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్లు ఆ స్థాయిలో గొప్పగా లేవు అని ధైర్యంగా చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఆ మాటలు వినిపిస్తున్నాయి కానీ పూర్తిగా విద్యుత్ వాహనాలు రోడ్లపై పరుగులు తీయడం అసాధ్యం. ఎందుకంటే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మన దగ్గర సిద్ధంగా లేదు. అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికే మన రోడ్లపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
అయితే రాబోయే నాలుగైదేళ్లలో మాత్రం ఖచ్చితంగా వీటి వాడకం మాత్రం గణనీయంగా పెరిగే సూచనలున్నాయి. తాజా బడ్జెట్లో కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించింది. వీటికి తోడు కొనుగోలుదార్లకు పన్ను చెల్లింపులో ఒకటిన్నర లక్ష వరకూ రాయితీని కూడా ఇచ్చింది. దీంతో ఇవి చాలా ఆకర్షణీయంగా మారాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు మన దేశంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఏవి, వాటి రేట్లు ఏంటో చూద్దాం.

టాటా టిగోర్
రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో టాటా టిగోర్ లాంఛ్ అయింది. 16.2 కిలో వాట్ల బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఒక సారి ఛార్జ్ చేస్తే 142 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒక బ్యాటరీప్యాక్‌ను 6 గంటల్లో 80 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సాధారణ ఏసీ సాకెట్, 15 కివీ ఫాసౌట్ ఛార్జర్ ఉంటే 90 నిమిషాల్లోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబ్తోంది. టాటా మోటార్స్ ఈ వాహనానికి మూడేళ్లు లేదా 1.25 లక్షల కిమీ వరకూ వారెంటీని అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ కార్ ఫ్లీట్ ఓనర్లకు మాత్రమే అమ్ముతున్నారు. రిటైలర్లు కొనే అవకాశం లేదు.

మహీంద్రా ఈ2ఓ ప్లస్
రూ.5.5 - 8.5 లక్షల ప్రైస్ రేంజ్‌లో కార్ లభ్యమవుతోంది. గతంలో రేవా పేరుతో ఉండే ఈ కారును కొద్దిగా మాడిఫై చేసి మహీంద్రా విక్రయిస్తోంది. నాలుగు డోర్లు ఉండే ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కార్ 11 కిలోవాట్ల లిథియమ్ అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిమీలు ప్రయాణించగలదు. అయితే టాప్ ఎండ్ వేరియంట్ 140 కిమీ వరకూ వెళ్లే వీలుంటుంది. బేస్ వేరియంట్ 6 గంటల్లోపు ఛార్జింగ్ పూర్తి చేసుకుంటే, టాప్ ఎండ్ వేరియెంట్ మాత్రం పెద్ద బ్యాటరీ కారణంగా 7.2 గంటల ఛార్జింగ్ సమయం తీసుకుంటుంది. అయితే 32యాంప్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో ఇది గంటన్నరలోనే ఛార్జింగ్ చేసుకునే సౌలభ్యమూ ఉంది.

మహీంద్రా ఈ వెరిటో
రూ.9.5-11 లక్షల మధ్య ఈ కార్ లభ్యమవుతోంది. ఇది ఫోర్ డోర్ సెడాన్ కార్. 13.91 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో నడుస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కిమీ రేంజ్ వస్తుంది. అయితే టాప్ ఎండ్ వేరియెంట్ మాత్రం ఒకసారి ఛార్జ్ చేస్తే 140 కిమీ వరకూ ప్రయాణిస్తుంది.
13.91 కిలో వాట్ల బ్యాటరీని సాధారణంగా ఛార్జ్ చేసేందుకు 8.30 గంటల సమయం పడ్తుంది. అదే ఫాస్ట్ ఛార్జర్‌తో మాత్రం గంటన్నరలో చేసేయొచ్చు.

త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు...
త్వరలో- హుందాయ్ కోనా, మహీంద్రా ఈకెయూవీ 100, మారుతి వ్యాగన్ ఆర్, నిస్సాన్ లీఫ్ కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. మరో ఏడాది, ఏడాదిన్నరలో ఈ కార్లు రోడ్లపై పరుగులు తీయొచ్చు.
ప్రస్తుతానికి ఒక్క మహీంద్రా మాత్రమే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో ఉండడం వల్ల జనాలు అంత ఆసక్తి చూపడం లేదు. పైపెచ్చు బ్యాటరీ మధ్యలో ఆగిపోతే ఎలాంటి ఛార్జింగ్ వ్యవస్థా లేకపోవడంతో జనాలు కూడా ధైర్యం చేయడం లేదు. అయితే రాబోయే నాలుగైదేళ్లలో మాత్రం ఈ వ్యవస్థ అనూహ్యంగా వృద్ధి చెందడం మాత్రం పక్కాగా కనిపిస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్‌లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications