భారత్ ఇప్పటికే 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. వచ్చే 5 ఏళ్ళ లోనే ఇది సాకారం కూడా కానుంది. అయితే, మన ఆర్ధిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ 7 కోట్ల కోట్లు ) కు చేరుకోవాలంటే భారత ప్రభుత్వం ఏం చేయాలో తాజాగా పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వే నివేదిక స్పష్టం చేసింది. ఒక ట్రిలియన్ డాలర్ అంటే... లక్ష కోట్ల డాలర్ల కు సమానం. ఆర్ధిక సర్వే నివేదిక లో పేర్కొన్నట్లు చేస్తే ... భారత్ 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడం ఖాయమని తెలిపింది.

పీవీ నర్సింహా రావు సంస్కరణలు
మాజీ ప్రధాని తెలుగోడు ఐన పీవీ నరసింహ రావు 1990 తోలి నాళ్లలో ప్రవేశ పెట్టిన ఆర్ధిక సంస్కరణలు మన దేశానికి కొత్త దశ దిశను నిర్దేశించాయి. తర్వాత అధికారం లోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు ఏవ్ విధానాలను కొనసాగించాయి. వాటి ఫలితాలు ఇప్పుడు స్పేతంగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు ఆకర్షిండం వాళ్ళ దేశంలో పారిశ్రామిక ప్రగతి వెల్లివిరిసింది. అనేక కారణాలతో దిగుమతులు నానాటికీ పెరుగుతున్నా ... ఎగుమతులు కూడా వేగంగా పెరిగాయి. దీంతో దేశంలో కోట్ల కొద్దీ ఉద్యోగాలను సృష్టించ గలిగాయి. సాంప్రదాయ పద్ధతిలో కేవలం ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలను సృష్టించాలంటే అయ్యే పని కాదని నిరూపితమైంది.

ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదాలంటే
అందుకే, కొంత కాలంగా నెమ్మదిస్తున్న ఆర్ధిక వ్యవస్థకు మళ్ళీ ఊపిరిలూదాలంటే .... అటు ప్రభుత్వం ... ఇటు ప్రైవేటు రంగాలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందే. ముఖ్యంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనపై నిధులను భారీ స్థాయిలో కుమ్మరించాల్సి ఉంటుందని ఆర్ధిక సర్వే పేర్కొంది. ఇప్పుడు భారత్ కొనసాగిస్తున్న వృద్ధి రేటు పరంగా చూస్తే ... జీడీపీ లో కనీసం 7-8% నిధులను కేవలం మౌలిక సదుపాయాల కల్పనా కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకోసం రమారమి ఏటా 200 బిలియన్ డాలర్లు (సుమారు 1.40 లక్షల కోట్లు ) అవసరం అని లెక్క కట్టింది. అంటే... ప్రస్తుతం భారత దేశం ఖర్చు చేస్తున్న 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ 70,000 కోట్లు) తో పోల్చితే ఇది రెట్టింపు కావడం విశేషం. ఇంట భారీ నిధులను ఎలా సమీకరించాలో కూడా సర్వే వెల్లడించింది.

పెట్టుబడులు ఆకర్షించవచ్చు
ప్రస్తుత ఆర్ధిక, ప్రపంచ గమన పరిస్థితుల మధ్య ఒక్క ప్రభుత్వమే ఏటా రూ 1.40 లక్షల కోట్ల నుంచి రూ 1.50 లక్షల కోట్లు కేవలం ఒక్క మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించటం ప్రభుత్వానికి అలవి కానీ పనే. అయితే, ప్రైవేట్లు పెట్టుబడులను ఇందుకోసం పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చునని ఆర్ధిక సర్వే పేర్కొంది. ఇప్పుడు కొనసాగుతున్న విధంగానే ఈ రంగం లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో పెట్టుబడులను సమీకరించి వచ్చని తెలిపింది. పీపీపీ పధ్ధతి ఇందుకు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయం పడింది. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ కూడా మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేయడం వల్లనే ఉద్యోగాలను సృష్టించగలిగాయి. తద్వారా మెరుగైన ఆర్ధిక వృద్ధి రేటును కొనసాగించి అభివృద్ధి పథం లో దూసుకు పోయాయి.

మందగమన పరిస్థితులు
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న మందగమన పరిస్థితులు త్వరగా చక్క బడాలన్న... రుణాల లభ్యత పెరగాలన్న... ప్రైవేటు పెట్టుబడులు భారీగా సమకూరాలన్న... ముందు ప్రభుత్వం ఓకే ముందడుగు వేయాల్సి ఉంటుంది. విధాన నిర్యాల్లోనూ స్పష్టమైన, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కొత్త ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్... ప్రధాని మోడీ ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకొంటారో వేచి చూడాల్సిందే.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications