న్యూఢిల్లీ: పార్లమెంటులో గురువారం ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సర్వేను 2019-20 నాటికి జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇది సరిపోదని ఆర్థికవేత్తల అంచనా. గత అయిదేళ్లలో సరాసరిగా 7.5 శాతం వృద్ధి సాధించామని చెబుతున్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలంటే వృద్ధి రేటు 8 శాతంగా ఉండాలని చెబుతున్నారు.
ఆర్థిక సర్వే స్టాక్ మార్కెట్లకు రుచించనట్లుగా ఉంది. సెన్సెక్స్ కాస్త తగ్గింది. గత కొన్నేళ్లుగా.. ఆర్థిక వృద్ధి మందగించిందని, నిరుద్యోగం పెరిగిందని, కార్పోరేట్ ఎర్నింగ్స్ ఆశించినంతగా లేవని, ప్రయివేటు సెక్టార్ పెట్టుబడులు రావడం లేదనే మాటలు వింటున్నామని చెబుతున్నారు. ఆర్థిక సర్వేను చూసిన తర్వాత అనిమల్ స్పిరిట్‌తో (జంతువులు పట్టుబడితే వదలవు) ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందని చెబుతున్నారు.

అటో మొబైల్స్ సేల్స్ తగ్గడం, నిరుద్యోగం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. దీంతో వీటిని నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకొని గట్టి కృషి, పట్టుదలతో ముందుకు వెళ్తేనే సాధ్యమని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యయం పెరగాలని, కానీ ద్రవ్యలోటు ఎక్కువగా ఉందని, కాబట్టి ఇది సాధ్యం కాని పరిస్థితులు అని చెబుతున్నారు.
రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో పలు రంగాలు ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అలాగే, వ్యయసాయ రంగం మరిన్ని క్యాష్ బెనిఫిట్స్ కోరుకుంటోంది. ఇండివిడ్యూవల్ ట్యాక్స్ పేయర్స్ మరిన్ని ప్రయోజనాలు కోరుకుంటున్నారు. మరోవైపు, లిక్విడిటీ పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా పరిష్కరించాలని చెబుతున్నారు. ఎన్బీఎఫ్‌సీ సెక్టార్, హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్‌లో ద్రవ్యలోటు ఎక్కువగా ఉందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి రేపు ప్రవేశపెట్టబోయేది కేవలం కేంద్ర బడ్జెట్ కాదని, కీలక అడుగులు వేసే దిశగా ఉండాలని కోరుకుంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications